Supta Vajrasana Pose : ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. ఎన్నిమందులు వాడినా ఫలితం లేదా.. ఈ ఆసనం ట్రై చేసి చూడండి
రోజు రోజుకీ పెరుగుతున్న పని ఒత్తిడి.. దీంతో శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే ధ్యానం చేస్తూ.. యోగానాలను వేస్తె.. మానసిక ఒత్తిని జయించవచ్చు,..
Supta Vajrasana Pose : రోజు రోజుకీ పెరుగుతున్న పని ఒత్తిడి.. దీంతో శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే ధ్యానం చేస్తూ.. యోగానాలను వేస్తె.. మానసిక ఒత్తిని జయించవచ్చు, కొంత వరకూ శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.. ప్రతి చిన్న చిన్న వ్యాధులకు ఇంగ్లిష్ మెడిసిన్స్ వాడితే.. సైడ్ ఎఫిక్ట్స్ తో పాటు అనవసరంగా డబ్బులు ఖర్చు కూడా.. ఐతే ఆస్తమా, మధుమేహం, కొవ్వు, స్థూలకాయం వంటి అనేక శారీరక ఇబ్బందులను చిన్న చిన్నయోగాసనాలతో తగ్గించుకోవచ్చు.. ఈరోజు ఆస్తమా నివారణకు అత్యంత ప్రయోజనకారి ఐన ఓ ఆసనం గురించి తెలుసుకుందాం..!
యోగాసనాలల్లో ఒకటి శుప్త వజ్రాసనం.. ఇది వజ్రాసనానికి సెకండ్ వెర్షన్ లాంటిది అన్నమాట..
శుప్త వజ్రాసనం వేయు పద్దతి:
*ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. (వజ్రాసనం వేయు విధానంను ఇంతకూ ముందు చెప్పుకున్నాం) *రెండు మోకాళ్లను కొంచెం దూరంగా ఉంచాలి. *రెండు పాదాల వేళ్లు దగ్గరగా వచ్చి మడమలు దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. *మోచేతులు శరీరానికి పక్కగా తెచ్చి నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి తీసుకెళ్లి తలను నేలకు ఆన్చాలి. *చేతులు రెండూ నెమ్మదిగా కాళ్లమీద పెట్టాలి. *ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా చేతి ఆసరాతో యథాస్థితికి రావాలి.
శుప్త వజ్రాసనం వల్ల ఉపయోగాలు :
*ఊపిరితిత్తులు, పక్కటెములకు మంచి శక్తినిస్తుంది. *ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది. *కాలి కండరాలను బలోపేతం చేస్తుంది. * థైరాయిడ్‌గ్రంథిని ఉత్తేజం చేసి.. ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ ఆసనంతో ఒత్తిడిని కూడా జయించవచ్చు.. మనసుకు ఉత్తేజం కలుగుతుంది.
Also Read: అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయురాలు కల్పనా చావ్లా జయంతి నేడు..