- Telugu News Photo Gallery Science photos Kalpana chawla birth anniversary lesser known facts about the first woman astronaut of indian origin
Kalpana Chawla Birth Anniversary: అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయురాలు కల్పనా చావ్లా జయంతి నేడు..
కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగు పెట్టిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి. నేడు కల్పనా చావ్లా జయంతి.. ఈ నేపథ్యంలో కల్పనా చావ్లా జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను మళ్ళీ గుర్తు చేసుకుందాం..!
Updated on: Mar 17, 2021 | 3:58 PM

కల్పనా చావ్లా 1962 మార్చి 17 న హర్యానాలోని కర్నాల్‌లో జన్మించారు. అయితే ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1వ తేదీ 1961కి మార్చారు. చిన్న వయస్సు నుండే కల్పన విమానాల పట్ల ఆకర్షితురాలయ్యారు. ఆమె పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు.

కల్పన టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందారు. కొలరాడో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం కల్పనా చావ్లా తన అద్భుతమైన ప్రతిభతో 1988లో నాసాలో అడుగు పెట్టారు.

1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్‌కార్పోరేటెడ్ లో ప్రెసిడెంట్ అయ్యారు. అదే సమయంలో ఓవర్‌సెట్ మెథడ్స్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా కూడా పనిచేశారు. 995 లో నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్నిపూర్తి చేసుకున్నారు.

1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడు కల్పనా 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. అప్పుడు కల్పన చావ్లా ను చూసి దేశం మొత్తం గర్వించింది. 1997 లో ఎస్‌టిఎస్ - 87 లో అంతరిక్షం పైకి వెళ్ళారు. మిషన్ స్పెషలిస్టుగా ఎస్‌టిఎస్ -87 ను ప్రయాణించిన ఆరుగురు సభ్యుల బృందంలో కల్పన ఒకరు.

2000లో ప్రారంభం కావాల్సిన రెండవ అంతరిక్ష ప్రయాణం కొన్ని కారణాలతో ఆలస్యమై.. రెండేళ్ల తర్వాత ప్రారంభమైంది. 2003 లో కల్పన యొక్క రెండవ అంతరిక్ష మిషన్ STS-107 మిషన్ ప్రారంభమైంది. రెండవ సారి అంతరిక్ష యాత్రను ముగించుకుని వస్తుండగా 2003 ఫిబ్రవరి 1 న కొలంబియా వ్యోమనౌక కూలిపోవడంతో ఆమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు దుర్మరణం పాలయ్యారు. జనవరి 16 నుండి ప్రారంభమైన ఈ మిషన్ 16 రోజులపాటు సాగింది.

ఆమె గౌరవార్ధం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని 2003 నుంచి ఏటా ప్రకటిస్తోంది.దీన్ని వివిధ రంగాల్లో 15 మంది శక్తివంతమైన మహిళకు అందజేస్తుంది. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2003లో ప్రయోగించిన మెట్ శాట్‌కు కల్పనా చావ్లా పేరు పెట్టారు. అంతరిక్షయానం చేసిన తొలి ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు.




