- Telugu News Photo Gallery Science photos In uk fell the astonishingly rare meteorite that can provide unique information
Rare Meteorite : భూమిపై పడిన అరుదైన ‘ఉల్క’.. విశ్వం పుట్టుక రహస్యాన్ని చెప్పేస్తుందా?..
Rare Meteorite : భూమిపై పడిన అరుదైన ‘ఉల్క’.. విశ్వం పుట్టుకను అధ్యయనం చేయొచ్చంటున్న శాస్త్రవేత్తలు..
Updated on: Mar 16, 2021 | 1:20 PM

లండన్‌లోని ఓ ఇంటి ఆవరణలో ఆకాశం నుంచి ఉల్క పడింది

ఆకాశం నుంచి జారిపడిన ఈ ‘ఉల్క’ ను అరుదైన శిలాజంగా నేచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొంది.

ఇది సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

దాదాపు 300 గ్రాముల బరువున్న ఈ ఉల్క శిలాజాన్ని కోట్స్‌వోల్డ్ పట్టణం వించ్‌కోంబే నుండి శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ శిలాజం కార్పొనేషియస్ కొండ్రైట్‌తో ఏర్పడిందని లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది.

కార్బోనేషియస్ కొండ్రైట్‌తో ఏర్పడిన ఉల్కలు చాలా అరుదైనవి అని, వీటి ద్వారా సౌర వ్యవస్థ పుట్టుక, నీరు, జీవన నిర్మాణం, గ్రహాల ఏర్పాటు, అనేక అంశాలను తెలుసుకోవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కార్బోనేషియస్ కొండ్రైట్స్‌తో ఏర్పడిన ఈ శిలాజంలో జీవుల పుట్టుకకు అవసరమైన అమైనో ఆమ్లాలు, ఇతర పదార్థాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.




