- Telugu News Photo Gallery Science photos Scientist found that water on mars evaporate due to lack of gravity
Water On Mars: అంగారక గ్రహంపై ఉన్న నీరంతా ఏమైపోయినట్లు.. పరిశోధనలు జరుపుతోన్న శాస్ర్తవేత్తలు.
Water On Mars: జీవి మనుగడకు అవకాశం ఉన్న మరో గ్రహంగా అంగారక గ్రహాన్ని భావిస్తుంటారు పరిశోధకులు. ఈ క్రమంలోనే మార్స్‌పై ఎన్నో ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మార్స్‌పై నీరు ఉండేదని కానీ....
Updated on: Mar 18, 2021 | 1:47 AM

మానవుడు అంతరిక్షంలో ఎక్కువగా ప్రయోగాలు జరిపే గ్రహాల్లో అంగారక గ్రహం (Mars) ఒకటి. ఈ క్రమంలోనే మార్స్‌పై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిపారు.

ఇదిలా ఉంటే తాజాగా మార్స్‌కు సంబంధించిన మరో అంశంపై పరిశోధకులు దృష్టిసారించారు. అదే అంగారక గ్రహంపై నీరు.

పరిశోధకులు అంచనా ప్రకారం.. రెడ్ ప్లానెట్‌పై బిలియన్ల ఏళ్ల క్రితం సమృద్ధిగా నీరు ఉండేదని. సరస్సులు, మహాసముద్రాలు కూడా ఉన్నాయని కానీ కాల క్రమేణా ఆ నీరంత పోయిందని భావిస్తున్నారు.

ఆ నీరు ఏటు పోయిందన్న దానిపై పరిశోధనలు చేపట్టిన శాస్ర్తవేత్తలు.. మార్స్‌పై గురుత్వాకర్షణ తగ్గడంతో అంతరిక్షంలోకి నీరు పోయిండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఉల్కలపై జరుపుతోన్న విశ్లేషణతో పాటు మార్స్ రోవర్స్, ఆర్టిటర్స్ అందించిన సమాచారం ఆధారంగా పరిశోధకుల బృందం ఈ విషయమై అధ్యయనం చేస్తోంది.

ఈ విషయంపై మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.




