Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్‏ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశన్ ధరించిన లెహంగా చుశారా ? ఎక్కడో చూసినట్టు ఉంది కదూ..

టీమిండియా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా.. టీవీ యాంకర్ సంజన గణేషన్‏ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 15న గోవాలో ఇద్దరి కుటుంబ సభ్యుల

జస్‏ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశన్ ధరించిన లెహంగా చుశారా ? ఎక్కడో చూసినట్టు ఉంది కదూ..
Sanjaya Ganeshan Anushka Sh
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 17, 2021 | 10:22 AM

టీమిండియా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా.. టీవీ యాంకర్ సంజన గణేషన్‏ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 15న గోవాలో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వ‌ధూవ‌రుల స‌న్నిహితులు కూడా కొంత‌మంది హాజరయ్యారు. ఇక వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పెళ్లిలో బుమ్రా సతీమణి సంజన… ధరించిన లెహంగా గురించి నెట్టింట్లో చర్చిస్తున్నారు. వివాహ వేడుకలో సంజన ధరించిన లెహంగా..లేద గూలబీ రంగులో అక్కడక్కడ గులాబీలు విరిసినట్టుగా అందంగా కనిపిస్తుంది. అయితే గతంలో విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా తన పెళ్లిలో ఇలాంటి లెహంగానే ధరించిందంటూ గుర్తుచేస్తున్నారు. అనుష్క పెళ్లి ఫోటోను.. సంజన పెళ్లి ఫోటోను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక అనుష్క లెహంగాకు సంజన ధరించిన లెహంగా కాస్త భిన్నంగా ఉందని..దీనిని డిజైనర్ సబ్యసాచి క్రియేట్ చేసింది. లైట్ పింక్ కలర్ లెహంగా.. దానికి తగిన జువెల్లరీతో సంజన కుందనపు బొమ్మలా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ధరించిన వస్త్రాల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు, సంజనకు వెడ్డింగ్ లెహంగాలను డిజైనర్ సబ్యసాచి ఎంతో అందంగా రూపొందించింది.

View this post on Instagram

A post shared by jasprit bumrah (@jaspritb1)

Also Read:

ఆ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..