ఆ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..

మన దేశంలో ఇప్పటివరకు దాదాపు 70 మిలియన్ల మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది జీవితకాలం కొనసాగుతునే ఉండే వ్యాధి.. అందుకే

ఆ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..
Untitled 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 17, 2021 | 8:12 AM

మన దేశంలో ఇప్పటివరకు దాదాపు 70 మిలియన్ల మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది జీవితకాలం కొనసాగుతునే ఉండే వ్యాధి.. అందుకే దీనికి జీవితాంతం నియంత్రణ పాటిస్తూనే ఉండాలి. డయాబెటిస్ లేని వ్యక్తులకు దానిని రాకుండా చేయడానికి మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ముఖ్యమని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది.

నాన్ ఓ బ్లడ్ గ్రూప్ వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందా ?

2014లో డయాబెటోలాజియాలోని ప్రచురించబడిన ఓ అద్యయనం ప్రకారం ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చితే.. నాన్ ఓ బ్లడ్ గ్రూప్ వక్యులకు డయబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

 అధ్యయనాల్లో వెలువడ్డ ఆసక్తికర విషయాలు..

యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ జర్నల్ 80 వేల మంది మహిళలో బ్లడ్ గ్రూప్స్ వారిగా టైప్ 2 డయాబెటిస్‏ను గుర్తించారు. ఇందులో 3553 మందికి టైప్ 2 డయబెటిస్ ఉన్నట్లుగా నిర్దారించారు. అందులో నాన్ బ్లడ్ ఓ గ్రూప్ ఉన్నవారికే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లుగా వెల్లడైంది.

బి బ్లడ్ గ్రూప్ వారికి డయాబెటిస్ ప్రమాదం ఉంటుందా..

ఒక అధ్యయనం ప్రకారం O బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళలతో పోలిస్తే.. A బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 10 శాతం ఎక్కువ ఉన్నట్లు తేలింది. అయితే B బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల O గ్రూప్ ఉన్నవారి కంటే 21 శాతం ఎక్కువగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. O బ్లడ్ గ్రూప్ తో పోలీస్తే.. బి బ్లడ్ గ్రూప్ ఉన్న స్త్రీలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది.

బి బ్లడ్ గ్రూప్ వారికి ఎందుకు ఎక్కువగా వస్తుంది..

ఇప్పటికీ బి బ్లడ్ గ్రూప్ వారికి డయాబెటిస్ ఎక్కువగా వస్తుందనే దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ కొన్ని అద్యయానాల ప్రకారం నాన్ విల్లెబ్రాండ్ కారకం అని పిలువబడే రక్తంలో ఒక ప్రోటీన్ నాన్ ఓ బ్లడ్ గ్రూప్ వారిలో ఎక్కువగా ఉంటుందని.. ఇది రక్తంలో చక్కెర స్తాయిలను పెంచుతుందని వెల్లడైంది. అందుకే వీరిలో ఎక్కువగా డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నట్లుగా పరిశోధకులు తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారు.. వారి శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం ఉత్తమం. అలాగే అందుకు సంబంధించిన చికిత్స తీసుకోవడం ఉత్తమమంటున్నారు నిపుణులు.

Also Read:

Beauty Tips: ముఖానికి నిమ్మరసం మంచి చేస్తుందా? నిమ్మకాయ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..