AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: దొంగచాటు యవ్వారం.. ప్రియురాలితో షికారు.. భార్యకు అడ్డంగా దొరికిన భర్త.. వైరల్ వీడియో!

Meerut Man Video: తాళికట్టిన ఇల్లాలికి తెలియకుండా ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు ఓ ప్రబుద్దుడు. తాను చేసే సీక్రెట్ యవ్వారాలు తెలియకుండా..

Viral: దొంగచాటు యవ్వారం.. ప్రియురాలితో షికారు.. భార్యకు అడ్డంగా దొరికిన భర్త.. వైరల్ వీడియో!
Meerut Man
Ravi Kiran
|

Updated on: Mar 17, 2021 | 12:09 PM

Share

Meerut Man Video: తాళికట్టిన ఇల్లాలికి తెలియకుండా ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు ఓ ప్రబుద్దుడు. తాను చేసే సీక్రెట్ యవ్వారాలు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే అనూహ్యంగా ప్రియురాలితో షాపింగ్ చేస్తూ అడ్డంగా ఇల్లాలికి దొరికిపోయాడు. ఆ తర్వాత ఇంకేముంది దబిడి దబిదే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది.

మీరట్‌కు చెందిన అద్నాన్, ఆయేషా భార్యాభర్తలు. వీరికి 2020 ఫిబ్రవరి నెలలో వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తాయి. తద్వారా వారి వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. దీనితో అయేషా తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇద్దరూ కూడా విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో కొనసాగుతోంది. ఇదే అదనుగా చేసుకున్న అద్నాన్.. తన ప్రియురాలితో చెట్టపట్టాలు వేసుకుంటూ తిరగడం ప్రారంభించాడు. ఈ సీక్రెట్ బాగోతాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ సీన్ అంతా రివర్స్ అయింది. ప్రియురాలితో షాపింగ్ చేస్తూ ఇల్లాలికి అడ్డంగా దొరికిపోయాడు.

తన భర్త వేరే మహిళతో ఓ షాపింగ్ మాల్‌లో ఉన్న విషయాన్ని ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న అయేషా.. అక్కడికి చేరుకొని భర్తను చితకబాదింది. ఈ తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు భార్యాభర్తలు ఇద్దరినీ కౌన్సిలింగ్ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అక్కడ కూడా ఈ జంట ఒకరిపై ఒకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. గతంలో అద్నాన్ తనపై దాడి చేశాడని ఆయేషా ఆరోపించగా… అయేషాకు తాను విడాకులు ఇచ్చేశానని అద్నాన్ అన్నాడు. విడాకుల పత్రాలు చూపించాలంటూ అయేషా సవాల్ చేసింది. ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. కాగా, తన భర్తను వేరే మహిళతో చూడటాన్ని అయేషా ఓర్చుకోలేకపోయిందని.. అందువల్లే రోడ్డుపై అతడితో వాగ్వాదానికి దిగిందని పోలీసులు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!