Bihar Girl: కన్న తండ్రే కాటేశాడు.. ఆ నరకం తప్పిచుకోడానికి ఓ వ్యక్తి తో పరిచయం.. ఆపై జరిగిందిదే..
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. తల్లికి చెప్పినా వినకపోవడంతో ఆ కుటుంబం నుంచి తప్పించుకునేందుకు వేసిన అడుగులు కూడా మరింత ప్రమాదంలో పడేసాయి. ట్రైన్లో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగించి.. ఉపాధి ఆశతో వెళ్లి మరో యువకుడు చేతిలో మోసపోయింది. ఈ దారుణమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. తల్లికి చెప్పినా వినకపోవడంతో ఆ కుటుంబం నుంచి తప్పించుకునేందుకు వేసిన అడుగులు కూడా మరింత ప్రమాదంలో పడేసాయి. ట్రైన్లో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగించి.. ఉపాధి ఆశతో వెళ్లి మరో యువకుడు చేతిలో మోసపోయింది. ఈ దారుణమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బీహార్‌కు చెందిన ఓ కుటుంబం వలస వచ్చి కుతుబుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు.. కూతురు 9వ తరగతి చదువుకుంది. కుటుంబీకులు కరోనా కారణంగా చదువు మాన్పించడంతో ఇంటి వద్ద ఉంటోంది ఆ అమ్మాయి. అయితే కొంతకాలంగా కన్న తండ్రి.. కుతూరుపై లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొద్దు అంటూ కూతురిని భయపెట్టాడు. ఆ అమ్మాయి ఈ విషయం తల్లికి చెప్పగా తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కట్టడి చేసింది. దీపావళికి వీరు బీహార్ నుంచి నగరానికి ట్రైన్లో వచ్చిన సమయంలో అదే రాష్ట్రానికి చెందిన సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. ఇంస్టాగ్రామ్లో ఇద్దరు చాట్ చేసుకున్నారు. అతడు బడంగ్పేట్ గాంధీనగర్‌లో నివాసిస్తున్నాడు. పరిచియం పెరిగి ఇద్దరు ప్రేమించుకున్నారు. గత నెల 26న సంతోష్ కలవాలని కోరడంతో ఆ అమ్మాయి సికింద్రాబాద్ వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తిరిగారు. తర్వాత అతడు కుద్భుల్లాపూర్లోని ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోయాడు.
చెప్పకుండా బయటికి వెళ్లినందుకు ఇంట్లో వాళ్లు కొడతారని భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్ స్టేషన్‌కి పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకొని సంతోష్‌కు ఫోన్ చేసింది. అతను యువతిని ఇంటికి రావాలన్నాడు. రవి సహాయంతో సంతోష్ ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి. మరుసటి రోజు మీ ఇంటికి వెళ్లాలని ప్రేమికుడు సంతోష్ చెప్పాడు. వెంట వచ్చిన రవిని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో అతడు సరే అంటూ అమీర్పూర్లోని తన గదికి తీసుకెళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉంది ఆ అమ్మాయి. 29న మధ్య మధ్యలో రవి ఆమెపై లాంగిక దాడికి పాల్పడ్డాడు. మరసటి రోజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సికింద్రాబాద్ స్టేషన్ రావాలని చెప్పింది. తల్లిదండ్రులు ఆమె చెప్పిన చోటుకు రావడంతో జరిగిన విషయం వివరించింది. బుధవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. తనపై జరిగిన అన్ని దారుణాలను పోలీసులకు వివరించింది ఆ అమ్మాయి. తండ్రితో పాటు రవి అనే వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..