Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు..
Railway Passenger Alert: సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 2న 32 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. జనవరి 4న మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 2న 32 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. జనవరి 4న మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరుస్తూ.. మరో ఆరు ప్రత్యేక రైళ్లను ద.మ.రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్-బ్రహ్మపూర్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్-బ్రహ్మపూర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటితో కలిపి రైల్వే శాఖ నడపనున్న సంక్రాంతి ప్రత్యేక రైళ్ల సంఖ్య 42కి చేరింది.
ప్రత్యేక రైలు 07025 జనవరి 12, 19 తేదీల్లో రాత్రి 07:45 గం.టలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గం.లకు బ్రహ్మపూర్ చేరుకోనుంది. అలాగే ఎదురుదిశలో ప్రత్యేక రైలు నెం.07026 జనవరి 13, 20 తేదీల్లో మధ్యాహ్నం 12:30 గం.లకు బ్రహ్మపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06:30 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది.
అలాగే ప్రత్యేక రైలు నెం.07027 జనవరి 13న రాత్రి 10:40 గంటలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 03:15 గం.లకు బ్రహ్మపూర్‌కి చేరుకోనుంది. ఎదురుదిశలో ప్రత్యేక రైలు నెం.07028 జనవరి 14న సాయంత్రం 06:00 గంటలకు బ్రహ్మపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-బ్రహ్మపూర్ మధ్య నడిచే నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లు (నెం.07025/07026) నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
అలాగే సికింద్రాబాద్-బ్రహ్మపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలు నెం.07093/07094 సికింద్రాబాద్, జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. నేరుగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, లేదా ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా ప్రయాణీకులు తమ టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు..
ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా 36 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి..
SCR to Run 32 Sankranti Special Trains @drmvijayawada @drmgnt @drmhyb @drmsecunderabad pic.twitter.com/IDex9T5iPf
— South Central Railway (@SCRailwayIndia) January 2, 2024
#Sankranti Special Train Services pic.twitter.com/KkMa4I3KGC
— South Central Railway (@SCRailwayIndia) January 4, 2024