Rich Dad, Poor Dad: ‘నాకు 1.2 బిలియన్‌ డాలర్ల అప్పు ఉంది..’ రిచ్‌ డాడ్‌ పూర్‌డాడ్‌ రచయిత షాకింగ్‌ వ్యాఖ్యలు

‘రిచ్‌ డాడ్‌.. పూర్‌ డాడ్‌’ పుస్తకం రచించిన ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, జపాన్‌ అమెరికన్‌ రాబర్ట్‌ కియోసా తెలియని వారుండరు. ఆయన రచించిన బుక్‌లో ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, వ్యాపారం వంటి పలు ఆర్థికాంశాలను వివరించారు. అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. అయితే తాజాగా రాబర్ట్‌ కియోసా..

Rich Dad, Poor Dad: 'నాకు 1.2 బిలియన్‌ డాలర్ల అప్పు ఉంది..' రిచ్‌ డాడ్‌ పూర్‌డాడ్‌ రచయిత షాకింగ్‌ వ్యాఖ్యలు
Rich Dad Poor Dad Author Robert Kiyosaki
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2024 | 10:06 AM

న్యూయార్క్‌, జనవరి 5: ‘రిచ్‌ డాడ్‌.. పూర్‌ డాడ్‌’ పుస్తకం రచించిన ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, జపాన్‌ అమెరికన్‌ రాబర్ట్‌ కియోసా తెలియని వారుండరు. ఆయన రచించిన బుక్‌లో ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, వ్యాపారం వంటి పలు ఆర్థికాంశాలను వివరించారు. అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. అయితే తాజాగా రాబర్ట్‌ కియోసా సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు ఒక బిలియన్‌ డాలర్ల అప్పులు ఉన్నాయంటూ షాకింగ్‌ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించారు.

ఇన్‌స్ట్రాలో కియోసాకి పోస్టు చేసిన రీల్‌ పోస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆస్తులు – రుణాల మధ్య క్లిష్టమైన వ్యత్యాసాన్ని వివరించారు. ‘చాలా మంది రుణాల్ని తీసుకొని విలాస వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అది అప్పు. నేను మాత్రం రుణాల్ని తీసుకొని ఆస్తుల్ని కొనుగోలు చేస్తానని ఆయన వివరించారు. అందుకు ఉదాహరణగా.. తాను కొనుగోలు చేసిన ఫెరారీ, రోల్స్‌ రాయల్స్‌ వంటి విలాసవంతమైన వాహనాలు అప్పు మాత్రమేనని, అవి ఆస్తులు కావని కియోసాకి అన్నారు. తన సంపాదనను డబ్బు రూపంలో తానెప్పుడు ఆదా చేయలేదన్నారు. ఆ మొత్తాన్ని వెండి, బంగారం రూపంలో మారుస్తానని చెప్పారు. ఇలా తన పెట్టుబడుల్లో భాగంగా తాను చేసిన అప్పు 1.2 బిలియన్‌ డాలర్ల (రూ.8,300 కోట్లు)కు చేరిందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కియోసాకి తన పోస్టులో అప్పుల్ని మంచి రుణాలు, చెడ్డ రుణాలుగా విభజించారు. ఆదాయం సంపాదించడానికి ఉపయోగించే రుణాలు సంపదను సృష్టిష్తాయని, అవి మంచి రుణాలని అన్నారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయటం వంటివన్నీ మంచి రుణాల కిందకు వస్తాయన్నారు. డబ్బు రూపంలో పెట్టుబడి పెట్టడం కంటే వెండి, బంగారంలో పెట్టుబడి పెట్టడం చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. చెడు రుణాలు మరింత అప్పుల్లోకి నెట్టేస్తాయని అన్నారు. కాగా మిస్టర్ కియోసాకి ప్రసిద్ధ వ్యక్తిగత ఆర్థిక వేత్తలలో ఒకరు. ఆయన 1997 రాసిన పుస్తకం ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ 40 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడు పోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.