Hyderabad: అందమైన అమ్మాయిలే అతని టార్గెట్.. పరిచయమయ్యారో అంతే సంగతులు.. చివరకు..
అందమైన అమ్మాయిలే అతడి టార్గెట్.. అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టిస్తాడు.. ఆ తర్వాత అమ్మాయిలకు పరిచయమై వారిని వలలో వేసుకుంటాడు.. అలా పరిచయాలు పెంచుకొని వ్యక్తిగత ఫోటోలు తెప్పించుకుంటాడు. అనంతరం ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తాడు. ఇలా అమాయక యువతులను వేధింపులకు గురి చేస్తూ అందిన కాడికి దోచుకుంటూ జల్సాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్థిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

సైబర్ క్రైం నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల సృష్టించడం ఆ తర్వాత మోసాలు లాంటి ఘటనలను చూస్తూనే ఉన్నాం.. నకిలీ ఎకౌంట్లతో మోసాలు చేస్తున్న నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టిన.. పుట్టగొడుగుల్లా మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా పలు ప్లాట్ ఫాంలలో నకిలీ ఎకౌంట్లను క్రియేట్ చేసి అమ్మాయిలే టార్గెట్ గా కొంతమంది కేటుగాళ్లు గలీజ్ దందాకు తెరలేపుతున్నారు. దీంతో ఏమి చేయలేక చాలామంది యువతులు అలానే ఉండిపోతున్నారు.. కొంతమంది ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకోవడం కలకలం రేపింది.
అందమైన అమ్మాయిలే అతడి టార్గెట్.. అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టిస్తాడు.. ఆ తర్వాత అమ్మాయిలకు పరిచయమై వారిని వలలో వేసుకుంటాడు.. అలా పరిచయాలు పెంచుకొని వ్యక్తిగత ఫోటోలు తెప్పించుకుంటాడు. అనంతరం ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తాడు. ఇలా అమాయక యువతులను వేధింపులకు గురి చేస్తూ అందిన కాడికి దోచుకుంటూ జల్సాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్థిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి అందమైన అమ్మాయిలను టార్గెట్ చేసుకొని నకిలీ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లను క్రియేట్ చేసి.. తర్వాత వారితో చనువుగా మాట్లాడుతూ వలలో పడేస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వ్యక్తిగత ఫోటోలను తీసుకుంటాడు. అనంతరం ఆ అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలను పంపాలని బెదిరిస్తుంటాడని పోలీసులు తెలిపారు.
ఇలానే ఓ కార్పొరేట్ స్కూల్ లో చదువుతున్న అమ్మాయిని ట్రాప్ చేసిన బీటెక్ విద్యార్థి.. చివరకు న్యూడ్ ఫొటోలను పంపాలని వేధింపులకు దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాలో పరిచయమై.. స్నేహం పేరుతో చనువుగా ఉండి ఫోటోలను తీసుకున్న బీటెక్ విద్యార్థి ఆమె వ్యక్తిగత ఫొటోలను తీసుకున్నాడు.. ఆ తర్వాత ప్రతిరోజు ఇలానే మూడు ఫోటోలను పంపాలని డిమాండ్ చేశాడు. చివరకు న్యూడ్ ఫోటోలు పంపాలంటూ తీవ్రంగా వేధిస్తుండటంతో స్కూల్ విద్యార్థిని మనోవేదనకు గురైంది. చివరకు వేధింపులు తాళలేక.. విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది.. దీంతో బాలికతో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బీటెక్ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఇలానే వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..