Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana MLC: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఆ ఇద్దరిని బరిలో దింపే సాహాసం..

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీలకు షెడ్యూల్ వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి ,కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ రెండు స్థానాల ఎన్నికల నిర్వాహాణకు ఎన్నికల సంఘం సిద్దమయింది. ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, ప్రస్తుతం కాంగ్రెస్‎కు 64 మంది, మిత్ర పార్టీ సీపీఐ కలుపుకుని 65మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Telangana MLC: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఆ ఇద్దరిని బరిలో దింపే సాహాసం..
Ts Congress
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srikar T

Updated on: Jan 05, 2024 | 2:42 PM

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీలకు షెడ్యూల్ వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి ,కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ రెండు స్థానాల ఎన్నికల నిర్వాహాణకు ఎన్నికల సంఘం సిద్దమయింది. ఒక్క ఎమ్మెల్సీ గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, ప్రస్తుతం కాంగ్రెస్‎కు 64 మంది, మిత్ర పార్టీ సీపీఐ కలుపుకుని 65మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‎కు ఒక ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ రెండో ఎమ్మెల్సీ గెలవడానికి మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, ఎంఐఎం నుంచి మద్దతు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండో అభ్యర్థిని దింపేందుకు కాంగ్రెస్ సాహాసిస్తుందా అనేది చూడాలి.

అయితే రెండో స్థానానికి నామినేషన్ వేయిస్తే ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎లో బలం లేని సమయంలో కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్‎కు ఉంది. అలాంటి స్ట్రాటజీ ఇప్పుడు అమలు చేస్తుందా, లేక ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఒక అభ్యర్థిని నిలబెతుందా చూడాలి. నికాసైన రాజకీయాలు చేయాలనుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆప్షన్ మాత్రమే ఉంది. దీని విషయంలో కూడా కాంగ్రెస్ అనేక ఆలోచనలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‎లో పార్టీ చాలా బలహీనంగా ఉంది, ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే గాని ,ఎమ్మెల్సీ గాని లేరు, అందులోనూ రేపు క్యాబినెట్ విస్తరణ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‎కు చెందిన మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దనే నిర్ణయం కాంగ్రెస్ తీసుకుందట. ఈ నేపథ్యంలో మస్కత్ అలీ, జాఫర్ జావిద్ పేర్లు చర్చలో ఉన్నాయి.

ఇక గత ఎన్నికల్లో టిక్కెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే అద్దంకి దయాకర, చిన్నారెడ్డి, బెల్లయ్య నాయక్, పార్టీకి పనిచేసిన వారి లిస్ట్‎లో వేం నరేందర్ రెడ్డి ముందుంటారు. ఇవేకాక గవర్నర్ కొటాలో రెండు ఎమ్మెల్సీలు కాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి భర్తీ పై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గవర్నర్ కోటాలో అందె శ్రీ, కోదండరాం పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలలో ఆక్టీవ్ గా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయడంతో గవర్నర్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అందె శ్రీ తో పాటు, రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ తెలంగాణ ఉధ్యమ నేత, ప్రొఫెసర్ కోదండరామ్ పేరు గవర్నర్‎కు నామినేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఒక నేతకు , గవర్నర్ కోటా‎లో ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారు. అయితే బలం లేకున్నా నాలుగో వ్యక్తిని పోటీలో పెడుతుందా అనేదే అసలు చర్చ. చూడాలి మరి కాంగ్రెస్ వ్యూహం తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..