Watch Video: మేకపిల్ల ఆకలి తీర్చిన కుక్క.. అమ్మ తనానికి జాతి వైరం ఉండదంటే ఇదేనేమో!

Adilabad: అసలే ఈ మద్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి.. వార్తలే వినిపిస్తున్న ఈ సమయంలో మాతృత్వాన్ని చాటిన ఈ శునకం వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. జాతి వైరం మరిచి మాతృత్వపు మాధుర్యం పంచిన ఈ శునకం తీరును చూసి వారెవ్వా అంటున్నారు.

Follow us
Naresh Gollana

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 05, 2024 | 3:25 PM

Viral News: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కల దాడులు పెరిగిపోయాయి. వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిపై వీధి కుక్కలు దాడి చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి. స్కూల్‌కి వెళ్తున్న చిన్నారులను పట్టి పీకిపెడుతున్నాయి. చివరకు ఇంట్లో ఉయ్యాలలో ఉన్న పిల్లల్ని సైతం వదలటం లేదు.. ఇటీవల ఓ కూలి చేసుకునే జంట వారి తొమ్మిది నెలల పసిబిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి పనులు చేసుకుంటుండగా.. వీధి కుక్కలు చిన్నారిని పీకిపెట్టాయి..ఇలాంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. గ్రామాల నుండి నగరాల వరకూ ఎక్కడ చూసినా పెరిగిన కుక్క కాట్లు గురించే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ కుక్క ఆ జాతి చెడ్డపేరును చెరిపేసే ప్రయత్నం చేసింది. ఆకలిగా ఉన్న ఒక మేక పిల్ల ఆకలి తీర్చింది ఇక్కడో శునకం. కుక్కల్లో సాధుతత్వం కోల్పోతున్న తరుణంలో ఒక కుక్క అమ్మతనాన్ని ప్రదర్శించింది. ఈ వింత సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపు‌నిండా తిండి పెట్టే జన్మే. అవును ఆ శునకం అలాగే చేసింది.. జాతి వైరాన్ని మరచి మేక పిల్లను అక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన అడవుల జిల్లా ఆదిలాబాద్ లోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఈ మద్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి.. వార్తలే వినిపిస్తున్న ఈ సమయంలో మాతృత్వాన్ని చాటిన ఈ శునకం వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. జాతి వైరం మరిచి మాతృత్వపు మాధుర్యం పంచిన ఈ శునకం తీరును చూసి వారెవ్వా అంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం భగవాన్ పూర్ గ్రామంలో యువరాజ్​ అనే యువకుడికి చెందిన పెంపుడు శునకం మూడు పిల్లలకు జన్మ నిచ్చింది. తన పిల్లలకు ఆ శునకం పాలు ఇవ్వగా చూసిన మేక పిల్ల దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. ఆ శునకం కూడా ఏమీ అనకుండా తన పిల్లలతో పాటు ఆ మేక పిల్లకు సైతం చనుబాలు ఇచ్చి ఆకలి తీర్చింది. అమ్మతనం అంటే అంతే కదా మరీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..