Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వరమాల వేళ.. వరుడి ఫ్రెండ్స్‌ హంగామా..! పగ తీర్చుకున్నారంటూ నెటిజన్ల రియాక్షన్ వైరల్‌..

వీడియోపై స్పందించిన నెటిజన్లు ఒక్కోక్కరు ఒక్కో విధంగా ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. స్నేహితులు ఇలాగే పగ తీర్చుకుంటారు మరీ.. అంటుడగా, నా పెళ్లిలోనూ ఇలాగే జరిగిదంటూ మరొకరు మొరపెట్టుకున్నారు. అలాంటి స్నేహితులను పెళ్లికి పిలవకూడదని మరొకరు రాశారు. దీంతో పాటు పలువురు దీనిపై సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలా భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.

Viral Video: వరమాల వేళ.. వరుడి ఫ్రెండ్స్‌ హంగామా..! పగ తీర్చుకున్నారంటూ నెటిజన్ల రియాక్షన్ వైరల్‌..
Bride Groom Varmala
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 03, 2024 | 9:48 PM

జీవితంలో స్నేహితులది చాలా ముఖ్యమైన స్థానం.. ఒకవైపు మన సుఖ దుఃఖాలన్నింటిలోనూ మనతో ఉంటూనే మరోవైపు సరదాగా గడపడంలో కూడా అంతే ముందుంటారు… కొందరు మన చుట్టూ ఉన్న అంగరక్షకుల వలె పనిచేస్తారు..మరికొందరు ఆటపట్టించటంలో వచ్చిన ఎలాంటి అవకాశాన్ని వదులుకోరు. ఇక్కడ కూడా అలాంటిదే ఒక పెళ్లిలో వరుడి స్నేహితులు చేసిన హంగామా మామూలుగా లేదు.. పెళ్లిలో స్నేహితులు చాలా విచిత్రమైన జోకులు వేస్తున్నారు. ఇలాంటి స్నేహితులు, పెళ్లిలో పంచ్‌లు వేస్తున్న సరదా సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటిదే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్నేహితులంటే.. సరదా, సందడి.. వారికి టైమ్‌, ప్లేస్‌తో సంబంధం లేదు.. చోటు చేదైనా, సమయం ఎప్పుడైనా సరే…స్నేహితులు ఎప్పుడూ ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటారు. అలాంటప్పుడు స్నేహితుడి పెళ్లిలో ఇంకెలా ఉంటుందో ఊహించలేం కూడా.. అలాంటి స్నేహితుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు చూస్తే.. వేదికపై వధూవరులు నిలబడి ఉన్నారు. ఈసారి వధూవరుల వరమాల కార్యక్రమం జరుగుతోంది. భార్యాభర్తలు ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు. ఈ సమయంలో భర్త స్నేహితులు ఒకవైపు నుంచి పెద్దగా అరుస్తున్నారు. ఆ సమయంలో భర్త మెల్లగా నవ్వాడు. ఆ జోకులకు ఆ నవవధువు..సీరియస్‌గా వాళ్లకేసి ఓ లుక్కిచ్చింది.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు అంతా సవ్యంగా జరిగేలా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్నీ సరిగ్గా సిద్ధం చేసుకుంటారు. ఆ సంతోషకరమైన రోజున, వధూవరులు తమ బంధువులు, స్నేహితులందరూ ఈ శుభ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందింస్తున్నారు.

ఈ వీడియో @khandakezzzzz Instagram ఖాతాలో షేర్‌ చేయబడింది. వీడియోపై స్పందించిన నెటిజన్లు ఒక్కోక్కరు ఒక్కో విధంగా ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. స్నేహితులు ఇలాగే పగ తీర్చుకుంటారు మరీ.. అంటుడగా, నా పెళ్లిలోనూ ఇలాగే జరిగిదంటూ మరొకరు మొరపెట్టుకున్నారు. అలాంటి స్నేహితులను పెళ్లికి పిలవకూడదని మరొకరు రాశారు. దీంతో పాటు పలువురు దీనిపై సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలా భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…