AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరేయ్‌.. నా వెంటపడ్డా వేంట్రా..! షాడో నుంచి తప్పించుకోలేక చిన్నారి..

పిల్లలు వారి బాల్యం నుంచే చాలా విషయాలు నేర్చుకుంటారు. అయితే.. ఒక్కడో చిన్నారి తన నీడను మొదటిసారి చూసినప్పుడు షాక్‌ అవుతుంది.. ఆ నీడను చూసి.. ఎవరో తనను వెంబడిస్తున్నట్లు భావించి, ఆమె తన నీడకు భయపడి దూరంగా పారిపోతుంది. ఆమె అమాయకత్వాన్ని చూసి మీరు కూడా అయ్యోపాపం అనుకుంటారు..ఈ వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది.

Viral Video: ఓరేయ్‌.. నా వెంటపడ్డా వేంట్రా..! షాడో నుంచి తప్పించుకోలేక చిన్నారి..
Child Girl Run Away
Jyothi Gadda
|

Updated on: Jan 03, 2024 | 8:44 PM

Share

చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటివి చాలా వీడియోలు ఫన్నీగా ఉంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్‌గా ఉంటాయి. ఒక్కోసారి ఈ చిన్నారులు సరదాగా కనిపిస్తుంటే, ఒక్కోసారి డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తారు. ఒక్కోసారి నవ్వుతూ, ఒక్కోసారి ఏడుస్తూ కనిపిస్తారు. వారి తల్లిదండ్రులు తమ పిల్లల వీడియోలను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటారు. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన అద్భుతమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్నారి.. తన నీడను చూసి భయపడి పరుగెత్తుతోంది. ఆమె అమాయకత్వాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ చిన్నారి అమాయకత్వాన్ని చూసి కాసేపు నవ్వుకుంటారు కూడా..

చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు.. పసిపిల్లలరె విరిసిన పూలతో పోలుస్తారు.. పిల్లలకు అమాయకత్వం ఎక్కువ. వారికి చాలా విషయాలు తెలియవు.. ఈ వీడియో కూడా ఆ విషయాన్ని నిరూపిస్తుంది.. పిల్లలు వారి బాల్యం నుంచే చాలా విషయాలు నేర్చుకుంటారు. అయితే.. ఒక్కడో చిన్నారి తన నీడను మొదటిసారి చూసినప్పుడు షాక్‌ అవుతుంది.. ఆ నీడను చూసి.. ఎవరో తనను వెంబడిస్తున్నట్లు భావించి, ఆమె తన నీడకు భయపడి దూరంగా పారిపోతుంది. ఆమె అమాయకత్వాన్ని చూసి మీరు కూడా అయ్యోపాపం అనుకుంటారు..ఈ వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో చిన్నారి ఎక్కడకు పరుగెత్తినా ఆమె చుట్టూ నీడ తిరుగుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇది చూసి ఆమె మరింత షాక్ అయ్యి చాలా భయపడుతుంది. వీడియో చివర్లో పాపం చిన్నారి భయంతో కింద పడిపోతుంది. ఈ వీడియో చూస్తుంటే సరదాగా ఉన్నప్పటికీ.. చిన్నారి భయం చూసి ఆందోళన వేస్తుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మరికొందరు షాడోస్ గురించి తమ తమాషా కథలను గుర్తుచేసుకుంటారు.

ఈ ఫన్నీ వీడియో Hood Clippy X ఖాతా నుండి షేర్ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ ఇచ్చారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి చిన్నారుల వీడియోపై వినియోగదారులు ఎల్లప్పుడూ లైక్‌ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..