Watch Video: కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి .. మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత ఆషా..

అయితే, ఈ జాతికి చెందిన చిరుతలు 1952లో అంతరించిపోవడంతో నమీబియా నుండి వీటిని దిగుమతి చేసుకుంది కేంద్రం. అలా ఏడు దశాబ్దాల తర్వాత భారతదేశంలో జన్మించిన మొదటి చిరుత పిల్లలు ఇవి. ఇది మన దేశంలో చేపట్టిన చిరుత సంరక్షణ ప్రాజెక్టుకు మరింత ఊతమిచ్చిందన్నారు కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్. ఈ మేరకు మంత్రి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చిరుత కూనలకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు.

Watch Video: కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి .. మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత ఆషా..
Project Cheetah
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 03, 2024 | 5:34 PM

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ‘ఆషా’ అనే నమీబియా చిరుతల్లో ఒకటి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ X ద్వారా ప్రజలతో షేర్‌ చేసుకున్నారు. కొత్తగా పుట్టిన చిరుత కూనలకు సంబంధించిన అందమైన వీడియోని కూడా షేర్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాల్ని హత్తుకునేలా కనిపించింది. కునో నేషనల్ పార్క్‌లో ఆశా అనే నమీబియా చిరుత బుధవారం మూడు పిల్లలకు జన్మనివ్వడంతో కొత్త సంవత్సరం కొత్త ఆశలకు నాంది పలికిందంటున్నారు జంతు ప్రేమికులు. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 18కి చేరింది. ఇది మన దేశంలో చేపట్టిన చిరుత సంరక్షణ ప్రాజెక్టుకు మరింత ఊతమిచ్చిందన్నారు మంత్రి భూపేందర్‌.

2023 మార్చిలో మరో చిరుత సియాయా తరువాత జ్వాలాగా పేరు మార్చబడింది. ఇది నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. జ్వాలా కూడా నమీబియా నుండి KNPకి తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న నిపుణులు, అధికారులందరికీ కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రాజెక్ట్ అని చెప్పారు. అలాగే, మన దేశంలోని వన్యప్రాణుల ఔత్సాహకులు, జంతుప్రేమికులందరికీ తన అభినందనలు తెలుపుతూ..మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ జాతికి చెందిన చిరుతలు 1952లో అంతరించిపోవడంతో నమీబియా నుండి వీటిని దిగుమతి చేసుకుంది కేంద్రం. అలా ఏడు దశాబ్దాల తర్వాత భారతదేశంలో జన్మించిన మొదటి చిరుత పిల్లలు ఇవి. అయితే, ఆశా నమీబియా నుండి ట్రాన్స్‌లోకేషన్ సమయంలో గర్భవతిగా ఉందని చెప్పారు అధికారులు. కానీ బహుశా ఒత్తిడి కారణంగా దానికి గర్భస్రావం జరిగింది. కొన్ని నెలల తర్వాత ఇలాంటి పిల్లి జాతి చిరుత మళ్లీ గర్భం దాల్చింది. ఇప్పుడు షియోపూర్‌లో ఉన్న అభయారణ్యంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..