Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Care: ఈ ఆయుర్వేద మూలికలతో చర్మ సమస్యలకు చెక్‌.. నవయవ్వనం మీ సొంతం..!

ఆయుర్వేదం ప్రకారం, సోరియాసిస్, ఎగ్జిమా, మొటిమలు, గజ్జి వంటి అనేక చర్మ సమస్యలకు కోల్డ్ ప్రెస్డ్ ఆయుర్వేద నూనె మంచిది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియకు, మధుమేహం నియంత్రణకు చాలా మంచిది. వేప చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముడతలు రాకుండా చేస్తుంది. ఇది శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మెరిసే చర్మానికి మంచిది.

Beauty Care: ఈ ఆయుర్వేద మూలికలతో చర్మ సమస్యలకు చెక్‌.. నవయవ్వనం మీ సొంతం..!
Beauty Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 03, 2024 | 3:05 PM

చర్మ సమస్యలు కొన్నిసార్లు సౌందర్య సమస్యలే కాదు ఆరోగ్య సమస్యలుగా కూడా మారుతుంటాయి. చర్మ అలెర్జీ వంటి సమస్యలు ఆరోగ్య సమస్యగా చెబుతారు. సోరియాసిస్, ఎగ్జిమా, చర్మం ఎర్రబడడం, మందంగా మారడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అంతే కాకుండా చర్మంపై మొటిమలు, పొడి చర్మం, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు అనేక బ్యూటీ సమస్యలు కలిగిస్తాయి. అటువంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదం సూచించే కొన్ని ప్రాథమిక మందులు ఉన్నాయి. ఆయుర్వేదంలో సహజ మార్గాల ద్వారా మెరిసే, అందమైన చర్మం కోసం పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం…

ఉసిరికాయ..

ఆయుర్వేదం చెప్పే గొప్ప మెడిసిన్‌ ఉసిరికాయ.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్న ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మ కణాలకు సహాయపడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, టోన్ చేయడానికి సహాయపడుతుంది. ఉసిరికాయ రసం సేవించినా, దీని రసాన్ని ముఖానికి పట్టించినా కూడా చాలా మంచిది. ముఖంపై ముడతలు పోగొట్టి చర్మం యవ్వనంగా కనిపించేందుకు ఇది చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

అలోవెరా..

అలోవెరా కూడా చర్మ సమస్యలకు, చర్మ సౌందర్యానికి దివ్యౌషధంగా ఆయుర్వేదం చెబుతుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. మెరిసే చర్మం, సాఫ్ట్ స్కిన్ కోసం దీనిని వినియోగించాలి. అలోవెరా జెల్‌ చర్మంపై అప్లై చేయడం చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఎ, బి12, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇది చర్మంపై మొటిమలు, మచ్చలను పోగొట్టడానికి దోహదపడుతుంది.

తేనె..

ఆయుర్వేదం సిఫార్సు చేసిన మరో సౌందర్య సాధనం తేనె. ఇది అందంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే తేనె చర్మానికి గొప్ప మాయిశ్చరైజర్. దీన్ని ముల్తానిమిట్టి, ఓట్స్ కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవచ్చు. తేనెను మీ ఆహారంలో భాగంగా చేసుకుని తినడం వల్ల కణాలకు కూడా మేలు జరుగుతుంది. ఇది అందాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వేప…

వేప అనేది ఆయుర్వేదంలో అత్యంత ముఖ్యమైన సౌందర్య ఉత్పత్తులలో ఒకటి. ఆయుర్వేదం ప్రకారం, సోరియాసిస్, ఎగ్జిమా, మొటిమలు, గజ్జి వంటి అనేక చర్మ సమస్యలకు కోల్డ్ ప్రెస్డ్ ఆయుర్వేద నూనె మంచిది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియకు, మధుమేహం నియంత్రణకు చాలా మంచిది. వేప చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముడతలు రాకుండా చేస్తుంది. ఇది శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మెరిసే చర్మానికి మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..