Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్! రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

ఎస్ఆర్డీపీలో భాగంగా నల్గొండ - ఓవైసీ డౌన్ ర్యాంప్ అలైన్ మెంట్ లో ఉన్న సంతోష్ నగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు. ఈ పనులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి.

Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్! రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
Water Problem
Follow us
Vidyasagar Gunti

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 02, 2024 | 9:29 PM

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1 లోని సంతోష్ నగర్ వద్ద 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా నల్గొండ – ఓవైసీ డౌన్ ర్యాంప్ అలైన్ మెంట్ లో ఉన్న సంతోష్ నగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు.

ఈ పనులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. ఈ నేపధ్యంలో 24 గంటల పాటు పలు రిజర్వాయర్ ల పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

ఇవి కూడా చదవండి

1. ఓ అండ్ ఎం డివిజన్ – 1 : మిరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ.

2. ఓ అండ్ ఎం డివిజన్ – 2(A): సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, ఆస్మన్ గఢ్, యాకుత్ పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్.

3. ఓ అండ్ ఎం డివిజన్ – 2(B) : రియాసత్ నగర్, ఆలియాబాద్.

4. ఓ అండ్ ఎం డివిజన్ – 4 : బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్.

5. ఓ అండ్ ఎం డివిజన్ – 5 : నారాయణ గూడ, అడిక్ మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలుకల గూడ.

6. ఓ అండ్ ఎం డివిజన్ – 10 (A) : దిల్ సుఖ్ నగర్ ప్రాంతం.

7. ఓ అండ్ ఎం డివిజన్ – 20 : బొంగులూరు.

8. ఓ అండ్ ఎం డివిజన్ – 22 : మన్నెగూడ.

కాబట్టి పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..