AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో లైన్‌.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్వేపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గం ప్రణాళికలపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎయిర్‌పోర్టుకు మెట్రోను రద్దు చేయటం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో లైన్‌.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
CM Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2024 | 8:49 PM

Share

హైదరాబాద్ మెట్రో రైల్వేపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గం ప్రణాళికలపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎయిర్‌పోర్టుకు మెట్రోను రద్దు చేయటం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్టు తెలిపారు.విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గించి మెట్రో నిర్మిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీహెచ్‌ఈఎల్​ నుంచి ఎయిర్‌పోర్టుకు 32 కిలోమీటర్లు ఉంటుందన్న సీఎం రేవంత్‌.. ఎంజీబీఎస్​ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో ఉంటుందని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రో లైన్‌ను లింక్ చేస్తామని వెల్లడించారు.

అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని రేవంత్​రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాము ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని న్యూ ఇయర్‌ రోజున మీడియా ప్రతినిధులకు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో విస్తరణ, కొత్త మార్గాలపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.

సమీక్షించిన అంశాలు..

ఐదు సెక్టార్లలో హైదరాబాద్ మెట్రో అభివృద్ధికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు మెట్రో ఫేజ్ -2 పై అధ్యయనం పై త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

* దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ వరకు, దారుషిఫా నుంచి ఫలక్నుమా వరకు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.

* రోడ్డు వైండింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం పెట్టి సూచనలు అభ్యంతరాలు తీసుకోవాలి.

* ఈ మార్గంలో 103 మతపరమైన ప్రార్థనా మందిరాలు హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని సమన్వయం చేసుకోవాలి.

* మియాపూర్-చందానగర్-BHEL-పటాన్ చెరువు (14 కి.మీ).

* MGBS-ఫలక్‌నుమా-చంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-P7 రోడ్డు-విమానాశ్రయం (23 కి.మీ).

* నాగోల్ -ఎల్‌బినగర్-ఒవైసీ హాస్పిటల్ – చాంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి- ఆరామ్‌గఢ్-కొత్త హైకోర్టు స్థలం రాజేంద్రనగర్‌లో NH (వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం పక్కనే) (19 కి.మీ.)

* కారిడార్-III రైదుర్గ్ స్టేషన్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (విప్రో సరస్సు Jn/అమెరికన్ కాన్సులేట్) వరకు బయోడైవర్సిటీ Jn, IIIT Jn మరియు ISB రోడ్ (12 కి.మీ) ద్వారా పొడిగింపు.

* LBనగర్-వంస్థలిపురం-హయత్‌నగర్ (8 కి.మీ).

* శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్.

* మెట్రో ఫేజ్-III ప్రణాళికలు JBS మెట్రో స్టేషన్ నుండి షామీర్‌పేట వరకు విస్తరించాలి.

* ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్లాన్ చేయండి – సిఎం.

* తారామతిపేట నుండి నాగోల్, MGBS (40 కి.మీ) మీదుగా నార్సింగి వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో మెట్రో రైల్‌ ప్రణాళికలు.

* ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసేందుకు రూపొందించాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..