Rice Price Hike: జనం నెత్తిన బియ్యం బాంబు.. సన్నబియ్యం ధరలకు రెక్కలు.. కొనలేక జనం సతమతం

అటు తుఫాను ప్రభావంతో కూడా బియ్యం ధరలు మరింత పెరుగనున్నాయి. మరోవైపు బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన వ్యాపారులు.. పక్కా పథకంతో ఉన్నారు. రైతుల నుంచి సన్న వడ్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. వాటిని బియ్యంగా మార్చి ధరలు పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు. పలు చోట్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరిగేలా చేస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు.

Rice Price Hike: జనం నెత్తిన బియ్యం బాంబు.. సన్నబియ్యం ధరలకు రెక్కలు.. కొనలేక జనం సతమతం
Rice Price Hike
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 02, 2024 | 7:47 PM

సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్న బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత నాలుగేళ్లలో ధరలను మించి ఈ ఏడాది సన్న బియ్యం ధర అనూహ్యంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 26 శాతం వరకు బియ్యం ధరలు పెరిగాయి. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు కడుపుకట్టుకుని కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్‌లో నీరు లేక వరి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో మిల్లర్లు, రిటైల్‌ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారు.

ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర రూ.6,500కు చేరింది. ఇదే అదనుగా భావించి పలువురు బ్రోకర్లు రైస్‌ మిల్లుల దగ్గర నుంచి కొన్న ధరకు అదనంగా కేజీకి 5 నుంచి 8 రూపాయలు బాదుతున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో 25 కిలోల పాత బియ్యం బస్తా 15వందల రూపాయల పైమాటే. గతేడాది గతేడాది సన్న బియ్యం ధర క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు ఉంది. అదే పాతబియ్యమైతే 4200 వరకు ఉండేది. కానీ ఇప్పుడు 6వేల నుంచి 6వేల 500 వరకు వెళ్లింది.

గత కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా రైతులు ఎక్కువగా వానకాలం సీజన్‌లోనే సన్న వడ్లు సాగు చేస్తుంటారు. అయితే.. ఈ వానకాలంలో జిల్లాలో సన్న ధాన్యం సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటున్నది. అటు తుఫాను ప్రభావంతో కూడా బియ్యం ధరలు మరింత పెరుగనున్నాయి. మరోవైపు బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన వ్యాపారులు.. పక్కా పథకంతో ఉన్నారు. రైతుల నుంచి సన్న వడ్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. వాటిని బియ్యంగా మార్చి ధరలు పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు. పలు చోట్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరిగేలా చేస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, వర్షకాలంలో చాలా మంది రైతులు దొడ్డు రకం వడ్లను మాత్రమే పండించారు. సన్న వడ్ల దిగుబడి తక్కువగా ఉంటుంది. పైగా సన్నాలకు చీడపీడల బాధలు ఎక్కువ. దీంతో రైతులు సన్నాలకు బదులుగా దొడ్డు వడ్లనే పండించారు.. పంట సాగుబడి తగ్గటం వల్ల కూడా సన్నాల ధరలు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..