Nitish Kumar Assets: 13 ఆవులు, 10 దూడలు.. ఆసక్తికరంగా బీహార్ సీఎం నితీశ్ ఆస్తుల చిట్టా..!
తన ఆస్తులకు సంబంధించి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వివరాలు వెల్లడించారు. 2023 డిసెంబరు 31 నాటికి తన మొత్తం ఆస్తుల విలువ రూ.1.64 కోట్లుగా ఆయన వెల్లడించారు. తనకు రూ.11.32 లక్షలు విలువ చేసే ఫోర్డ్ కారు, రూ.1.28 లక్షల విలువైన రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం ఉన్నట్లు తెలిపారు.
తన ఆస్తులకు సంబంధించి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వివరాలు వెల్లడించారు. 2023 డిసెంబరు 31 నాటికి తన మొత్తం ఆస్తుల విలువ రూ.1.64 కోట్లుగా ఆయన వెల్లడించారు. తనకు రూ.11.32 లక్షలు విలువ చేసే ఫోర్డ్ కారు, రూ.1.28 లక్షల విలువైన రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం ఉన్నట్లు తెలిపారు. అలాగే రూ.1.45 లక్షల విలువైన 13 ఆవులు, 10 ఆవు దూడలు, ట్రెడ్‌మిల్, వ్యాయామ సైకిల్ తదితర చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ జాబితాలో మైక్రోవేవ్ ఓవన్ కూడా ఉంది. ప్రస్తుతం తన దగ్గర రూ.22,552 నగదు ఉండగా.. బ్యాంకు డిపాజిట్లు రూ.49,202 ఉన్నట్లు తెలిపారు. న్యూఢిల్లీలోని ద్వారకలో 2004లో రూ.13.78 లక్షలకు కొనుగోలు చేసిన అపార్టమెంట్ ఫ్లాట్ మాత్రమే నితీశ్ కుమార్‌కు చెందిన ఏకైక స్థిరాస్తి. దీని విలువ ప్రస్తుతం రూ.1.48 కోట్లుగా నితీశ్ తన ఆస్తుల జాబితాలో చూపారు. ప్రతి యేటా చివరి రోజున బీహార్ సీఎం నితీష్ కుమార్.. తనతో పాటు మంత్రివర్గ సహచరులు తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఆ మేరకు నితీష్, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రకటించిన ఆస్తుల వివరాలను జనవరి 1న బీహార్ ప్రభుత్వ అధికారులు కేబినెట్ సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
నితీశ్ కుమార్ మంత్రివర్గంలో 28 మంది ఆయన కంటే ధనవంతులే. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు నితీశ్ కంటే మూడింతలు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. తన ఆస్తుల విలువ రూ.6.24 కోట్లుగా తేజస్వీ యాదవ్ వెల్లడించారు. నితీశ్ కుమార్ కేబినెట్‌లో ఇద్దరు మంత్రులకు మాత్రమే నితీశ్ కంటే తక్కువ ఆస్తులు ఉన్నాయి. జామా ఖాన్ ఆస్తుల విలువ రూ.68.60 లక్షలుగా ఉండగా.. ఇజ్రాయెల్ మన్సూరికి రూ.1.10 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి.