కొంపముంచిన పొగమంచు.. భారీ రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా వస్తున్న బస్సు, ట్రక్కు ఢీ కొనడంతో..
స్వల్ప గాయాలైన పలువురు ప్రయాణికులను చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచినట్టుగా కలెక్టర్ తెలిపారు. దట్టమైన పొగమంచు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవటం, బస్సు ఎవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా బాధితులు ఆరోపించారు.
ఒడిశాలోని కటక్ జిల్లాలో ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సుమారు 20 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కటక్-చంద్‌బాలి రహదారిపై కటక్‌పాడ సమీపంలోని నిశ్చింతకోయిలి బ్లాక్‌లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు గూడ్స్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు, ఒక ప్రయాణీకుడు మరణించారు. మృతులు ఇద్దరు కేంద్రపారా జిల్లాకు చెందిన వారు కాగా, ట్రక్ డ్రైవర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ట్రక్కు రాజస్థాన్‌కు చెందినదిగా కటక్ కలెక్టర్ నరహరి సేథీ తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దెబ్బతిన్న బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. గాయపడిన ప్రయాణికులను నిశ్చింతకోయిలీ ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో తీవ్రంగా గాయపడిన 11 మందిని కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారి తెలిపారు.
స్వల్ప గాయాలైన పలువురు ప్రయాణికులను నిశ్చింతకోయిలీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచినట్టుగా కలెక్టర్ తెలిపారు. దట్టమైన పొగమంచు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవటం, బస్సు ఎవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా బాధితులు ఆరోపించారు.
దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రవాణా శాఖ కమిషనర్ అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. రవాణా శాఖ అధికారులు, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..