Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిట్ అండ్ రన్ చట్టంపై డ్రైవర్లు ఆందోళన.. కట్‌చేస్తే.. పెట్రోల్‌ బంక్‌ల ఎదుట క్యూ కట్టిన వాహనదారులు

బ్రిటిష్ కాలంనాటి పాత శిక్ష చట్టం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంలో యాక్సిడెంట్‌ చేసి పారిపోయినా, ఘటనకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు చేయకున్నా 10ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. దీనిపై డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లు ఆందోళనకు దిగడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు సొంతవాహనాలను బయటకు తీసి ట్యాంకులు నింపుకుంటున్నారు.

హిట్ అండ్ రన్ చట్టంపై డ్రైవర్లు ఆందోళన.. కట్‌చేస్తే.. పెట్రోల్‌ బంక్‌ల ఎదుట క్యూ కట్టిన వాహనదారులు
Q Petrol
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2024 | 4:39 PM

కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టంపై డ్రైవర్లు ఆందోళనకు దిగారు. నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్‌ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో పలు రాష్ట్రాల్లో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో బంకులకు క్యూకడుతున్నారు వాహనదారులు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోలు బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపించాయి. పెట్రోలు, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోలు బంకులన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిడిపోయాయి.

కేంద్రం తీసుకొస్తున్న కొత్త శిక్ష చట్టంలోని కఠినమైన హిట్ అండ్ రన్ నిబంధనకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ట్రాన్స్‌పోర్ట్ అసియేషన్‌తోపాటు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ట్యాంకులు ఫుల్ చేయించుకునేందుకు వాహనదారులు బారులు దీరారు.