Telugu News Business Electric blanket price start from 900 on amazon and flipkart how to use Telugu News
చలి నుంచి రక్షణను అందించే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. అందమైన రంగులు, అందుబాటు ధరల్లోనే..
దేశంలోని పలు ప్రాంతాల్లో చలితీవ్ర చంపేస్తోంది. చలి తీవ్రత కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఎముకలు కొరికే చలి నుండి మిమ్మల్ని రక్షించే ప్రత్యేక ఉత్పత్తి గురించి మేము మీకు చెప్పబోతున్నాము. ఇది మిమ్మల్ని చలి నుండి కాపాడుతుంది. అదే ఎలక్ట్రిక్ దుప్పటి.. ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్లను ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్ల నుండి సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ దుప్పట్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
Electric Blanket
Follow us
ఈ దుప్పట్ల స్పెషల్ ఏమిటంటే అవి మీరు మంచంపై వాలగానే మీకు చాలా త్వరగా, సురక్షితంగా వెచ్చదనాన్ని అందిస్తాయి. ఎంత చలిని అయినా అధిగమించవచ్చు. తీవ్రమైన చలిలో మీకు ఇది ఉపశమనం ఇస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ పేరు చెప్పగానే చాలా మంది మదిలో ఒక ప్రశ్న మెదులుతుంది. దీనివల్ల కరెంట్ షాక్ వంటి సమస్యలు ఉండవా అనే సందేహం కలుగుతుంది. వాస్తవానికి, ఇది షాక్ప్రూఫ్ ఉత్పత్తి. Amazon Indiaలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్‌ను విక్రయిస్తున్న విక్రేత ఈ వివరాలను వెల్లడించారు.
ఎలక్ట్రిక్ దుప్పటిని ఉపయోగించడానికి, దానిని ప్లగ్‌కి కనెక్ట్ చేయాలి. దీని తర్వాత దానిలో ఉష్ణోగ్రత సెట్ చేయాలి. ఆ తర్వాత అది తన పనిని చేయడం ప్రారంభిస్తుంది. ఇందులో కావాల్సిన టెంపరేచర్లో ఉష్ణోగ్రత సెట్ చేసుకోవచ్చు.
ఈ- కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్ల అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ కాకుండా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని స్థానిక మార్కెట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ ఎలక్ట్రిక్ దుప్పట్లు వివిధ ధరల్లో లభిస్తున్నాయి. దీని ప్రారంభ ధర రూ. 900 నుండి ప్రజలకు అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ దుప్పట్లు అనేక రకాల పేర్లతో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బెడ్ వార్మర్, ఎలక్ట్రిక్ అండర్ బ్లాంకెట్ పేరుతో వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఎలక్ట్రిక్ దుప్పటికి సంబంధించి తలెత్తే రెండవ ప్రశ్న.. దీనిని ఉతకవచ్చా అనేది. సాధారణంగా ఇది హీటింగ్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది. ఇది నీళ్లలో తడిస్తే పాడవుతుంది. అయితే, చాలా కంపెనీలు తమ హీటింగ్ ఎలిమెంట్ వాటర్ ప్రూఫ్ అని పేర్కొంటున్నాయి. ఇది దుప్పటిని సురక్షితంగా ఉంచుతుంది.
సాధారణ బ్లాంకెట్లలో రెసిస్టెన్స్ వైర్ వేడెక్కడం ద్వారా విద్యుత్ శక్తి, ఉష్ణశక్తిగా మారుతుంది. అయితే ఈ బ్లాంక్లెట్లలో పొరలు పొరలుగా కాటన్ ఉండి, దాని మధ్యలో పీవీసీ పైప్ ఉంటుంది. ఈ పైప్ ద్వారా ఉష్ణశక్తి దుప్పటిలోని అన్ని వైపులకు వెళుతుంది.