UPI: యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు.. అమల్లోకి వచ్చేశాయ్..

ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కొన్ని విభాగాలకు ఈ చెల్లింపు పరిమితి 15 వేలుగా ఉంది. అలాగే ఇప్పటి వరకు ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా ఒకసారి 1 లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు ఆ పరిమితి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది...

UPI: యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు.. అమల్లోకి వచ్చేశాయ్..
UPI Payments
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2024 | 6:37 AM

ఇదిలా ఉంటే.. భారత్‌లో పేమెంటింగ్‌ విధానాన్నే సమూలంగా మార్చేసింది..‘యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌”. అదే సింపుల్‌గా యూపీఐ. ఇప్పుడు ఈ విధానాన్ని మరింత విస్తరించేందుకు మరిన్ని మార్పులు చేసింది ఆర్‌బీఐ. కొత్త సంవత్సరం సందర్భంగా ఆ మార్పులు అమల్లోకి వచ్చాయి. దేశంలో యూపీఐ వినియోగాన్ని మరింత విస్తరించేలా ఆర్‌బీఐ జనవరి 1 నుంచి కొన్ని కీలక మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది. యూపీఐ ద్వారా చేసే ఆటోమేటిక్‌ చెల్లింపుల పరిమితిని లక్షకు పెంచుతున్నట్లు RBI గతంలో ప్రకటించింది. ఇప్పుడు ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కొన్ని విభాగాలకు ఈ చెల్లింపు పరిమితి 15 వేలుగా ఉంది. అలాగే ఇప్పటి వరకు ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా ఒకసారి 1 లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు ఆ పరిమితి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఏడాది కంటే ఎక్కువ సమయం నుంచి యూపీఐ ఐడీలు, నంబర్లు వినియోగంలో లేకపోతే.. అవన్నీ డియాక్టివేట్‌ కానున్నాయి. అలాగే ఇకపై యూపీఐ యాప్‌ల నుంచి ఎవరికి చెల్లింపులు చేసినా.. వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాంతో తప్పుడు లావాదేవీలకు అరికట్టేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

డిజిటల్‌ వాలెట్లు లేదా ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ’ను ఉపయోగించి చేసే యూపీఐ చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ వర్తిస్తుంది. అయితే 2,000 పైన చేసే మర్చంట్‌ లావాదేవీలపై మాత్రమే ఈ తరహా ఛార్జీలను విధిస్తారు. బ్యాంక్‌ ఖాతా నుంచి బ్యాంక్‌ ఖాతాకు లేదా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయనుంది ఆర్బీఐ. దీంతో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి క్యాష్‌ విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ తరహా ఏటీఎంలు దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

రికార్డ్‌ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

దేశంలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 1.6 లక్షల కోట్ల పన్నులు జీఎస్టీ రూపంలో వసూలైనట్టు ఆర్థికశాఖ ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు.. అంటే 9 నెలల కాలంలో సుమారు 15 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 12శాతం ఎక్కువ వసూలు వచ్చాయి.

ఈ 9 నెలల్లో నెలవారీ సగటున 1.66 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 8 వేల కోట్లకు పైగా పన్నులు వసూలయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో 4,753 కోట్లతో తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది. 2017 జూలై ఒకటిన పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..