Morning Walk in winters: పొగమంచులో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలుసా..!

దట్టమైన పొగమంచులో నడవడం వల్ల ఛాతీ నొప్పికి గురికావాల్సి వస్తుంది. ఉదయాన్నే దట్టమైన చలిలో వాకింగ్‌ చేయటం వల్ల ఊపిరితిత్తులపై కూడా చాలా ప్రభావం పడుతుంది. దట్టమైన పొగమంచులో నడవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి పరిస్థితిలో దట్టమైన పొగమంచులో నడవడం మానుకోండి.

Morning Walk in winters: పొగమంచులో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలుసా..!
Morning Walk in winters
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 02, 2024 | 4:36 PM

నడక ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. రోజూ వాకింగ్ తప్పనిసరిగా చేయాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. మార్నింగ్ వాక్ చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక సమస్యలు దూరం అవుతాయి. గుండె, షుగర్ బాధితులకు వాకింగ్‌ చాలా ఉపయోగకరం అంటున్నారు. అయితే, వేసవిలో ఉదయాన్నే నిద్రలేచి మార్నింగ్‌ వాక్‌ చేయటం అందరికీ చాలా ఈజీనే.. కానీ, శీతాకాలంలో ఉదయం లేవడమంటేనే చాలా కష్టం. చలి, దట్టమైన పొగమంచులోనూ వాకింగ్‌కు వెళ్లేవాళ్లు కూడా ఉన్నారు. అయితే దట్టమైన పొగమంచులో వాకింగ్‌కు వెళ్లటం ప్రయోజనకరమా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. దట్టమైన పొగమంచులో వాకింగ్‌ వల్ల కలిగే లాభనష్టాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు దట్టమైన పొగమంచులో మార్నింగ్ వాక్ చేయకూడదు. 45 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు విపరీతమైన చలిలో నడవడం మానుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది.

అదే సమయంలో పొగమంచులో నడవడం అధిక రక్తపోటు రోగులకు హానికరం. పొగమంచులో నడవడం వల్ల ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీనితో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

దట్టమైన పొగమంచులో నడవడం వల్ల ఛాతీ నొప్పికి గురికావాల్సి వస్తుంది. ఉదయాన్నే దట్టమైన చలిలో వాకింగ్‌ చేయటం వల్ల ఊపిరితిత్తులపై కూడా చాలా ప్రభావం పడుతుంది. దట్టమైన పొగమంచులో నడవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి పరిస్థితిలో దట్టమైన పొగమంచులో నడవడం మానుకోండి.

రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, చిన్నారులు బయట తిరగకపోవడం మంచిదని, తప్పనిసరైతే తలకు మఫ్లర్‌, మంకీ టోపీలు, ముఖానికి మాస్కులు ధరంచి బయటకు రావడం మంచిదంటున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.