Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్ తప్పనిసరి.. ఇలాంటి దుస్తుల్లో వస్తే.. నో ఎంట్రీ
సోమవారం నుంచి భువనేశ్వర్‌లోని లింగరాజు ఆలయంలో పాన్, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని కూడా నిషేధించారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ శివాలయం ప్రాంగణంలోకి పొగాకు లేదా తమలపాకులు నమలుతున్న భక్తులను అనుమతించడం లేదు. లింగరాజు ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించిన ప్రకారం ఆలయంలో పాలిథిన్ మరియు ప్లాస్టిక్‌ల వాడకాన్ని కూడా నిషేధించారు.
పూరి జగన్నాథ ఆలయంలో 2024 జనవరి 1 నుంచి టోర్న్ జీన్స్, స్లీవ్‌లెస్ దుస్తుల్లో ఎవరైనా వస్తే గుడిలోకి అనుమతి ఉండదు. గుడి బయటే దండం పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ 12వ శతాబ్దపు ఆలయంలోకి ప్రవేశించాలనుకునే భక్తులకు శ్రీ జగన్నాథ ఆలయ నిర్వాహకులు ఈ ఏడాది జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేశారు. అదే సమయంలో శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA) 2024 నూతన సంవత్సరం రోజు నుండి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో గుట్కా మరియు పాన్ నమలడం తో పాటు ప్లాస్టిక్ మరియు పాలిథిన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.
శ్రీ జగన్నాథ టెంపుల్ ఈ వో సాయి మాట్లాడుతూ భక్తులు మందిరంలోకి ప్రవేశించడానికి సంప్రదాయ బట్టలు ధరించాలి. హాఫ్ ప్యాంట్లు, షార్ట్‌లు, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించిన భక్తులను ఆలయంలోకి అనుమతించరనీ, చాలా స్ట్రిక్ట్ గా కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు.
భారీ ఎత్తున ప్రచారం నిర్వహించడం తో మొదటి రోజే సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన భక్తులు
డ్రెస్ కోడ్ నియమం అమల్లోకి రావడంతో కొత్త సంవత్సరం 2024 జనవరి మొదటి రోజున ఆలయానికి వచ్చే పురుష భక్తులు ధోతీ మరియు కండువా ధరించి కనిపించారు. అదే సమయంలో మహిళలు కూడా చీరలు లేదా సల్వార్ కమీజ్‌లు ధరించి దర్శనం కోసం తరలిరావడం తో ఆలయ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి.
ఈ తెల్లవారుజామున 1.40 గంటలకు ఆలయం తెరిచే సమయానికే ఆలయం ముందు ఉన్న గ్రాండ్‌రోడ్డు వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. రాత్రి 8 గంటల వరకు సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు జగన్నాథ ధామాన్ని దర్శించుకోవడం విశేషం. మధ్యాహ్నం కాసేపు నైవేద్య విరామం తప్ప అవాంతరాలు లేని దర్శనం సాగింది..సీనియర్ సిటిజన్స్, దివ్యాంగ భక్తులకు పోలీసులు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారని పూరి పోలీసు సమర్థ్ వర్మ టీవీ 9 తో తెలిపారు.
నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు..
జగన్నాథ ఆలయానికి అనుసంధానంగా ఉన్న లింగరాజు ఆలయ ప్రాంగణంలో గుట్కా, పాన్‌లపై నిషేధం విధిస్తూ దాని పవిత్రతను కాపాడుతున్నట్లు అధికారి సాయి తెలిపారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు దర్శనం కోసం ఎస్‌జేటీఏ, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల నిర్మించిన ఎయిర్ కండిషన్డ్ ఫ్యాబ్రిక్ షెడ్ నిర్మాణం సోమవారం ఉదయం నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన నిర్మాణంలో తాగునీరు మరియు పబ్లిక్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచబడ్డాయి. వాటిల్లో సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చేశారు.
సెంట్రల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే దాదాపు రెట్టింపు సంఖ్యలో భక్తులు ఈరోజు ఆలయాన్ని సందర్శించారన్నారు. తెల్లవారుజామున 1.40 గంటలకు ప్రారంభమైన దర్శనం ఇంకా కొనసాగుతోంది.
ఆలయాన్ని సందర్శించిన తర్వాత, భక్తులు ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తున్నారని సింగ్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బడాదండలోని మార్కెట్ చక్కా నుండి సింగద్వార (ప్రధాన ద్వారం) మధ్య ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించగా, దిగబరేణి నుండి లైట్‌హౌస్ వరకు బీచ్‌సైడ్ రోడ్డులో వాహనాలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు.
పొగాకు వాడకం కూడా నిషేధం..
సోమవారం నుంచి భువనేశ్వర్‌లోని లింగరాజు ఆలయంలో పాన్, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని కూడా నిషేధించారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ శివాలయం ప్రాంగణంలోకి పొగాకు లేదా తమలపాకులు నమలుతున్న భక్తులను అనుమతించడం లేదు. లింగరాజు ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించిన ప్రకారం ఆలయంలో పాలిథిన్ మరియు ప్లాస్టిక్‌ల వాడకాన్ని కూడా నిషేధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..