- Telugu News Photo Gallery Is Horse Gram Effective For Weight Loss? Everything You Need To Know Telugu News
Horse Gram Benefits: వారెవ్వా.. ఉలువలు చేసే మేలు గురించి తెలిస్తే వాటిని అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలు అనేది నవధాన్యాలలో ఒకటి. అలాంటి ఉలవలను మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరానికి కావాలసిన పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉలవలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుందాం.
Updated on: Jan 01, 2024 | 8:24 PM

ఉలవలు తీసుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్యని పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉలవలతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఐరన్ అధికంగా దొరుకుతాయి. ఇది చిన్న పిల్లలు తినడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు.

శీతాకాలంలో వచ్చే కఫ దోష సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఆకలిలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఉలవలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో వచ్చే రాళ్లు సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఉలవలను, బియ్యాన్ని కలిపి జావగా తయారు చేసుకొని తాగడం వల్ల లైంగిక సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీనితో పాటు పాలను కూడా రాత్రి పూట తీసుకోవాలి. ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమయంలో ఉలవల చారు చేసుకొని తినడం వల్ల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.






























