- Telugu News Photo Gallery Jamun leaf tea is magic health drink that is good for heart mental health and boosts immunity Telugu News
రాముడు మెచ్చిన పండు ఇది..! దీని ఆకులతో చేసిన టీ తాగితే, ప్రాణాంతక వ్యాధులు పరార్..
ఆయుర్వేదంలో అల్ల నేరేడు పండును అపర సంజీవనిగా పిలుస్తారు. ఈ పండులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్లు బెరడు సైతం అనేక ఔషధ తయారీలో వాడుతారు. జ్ఞాపకశక్తి మెరుగు పరచుకోవాలంటే నేరేడు పండు తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, నోటిపూత, చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం, మూత్రంలో మంట తదితర సమస్యలకు నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి.
Updated on: Jan 02, 2024 | 4:03 PM

అల్ల నేరేడు పండ్ల ఆకులతో తయారు చేసిన టీని క్రమం తప్పకుండా తాగితే, మీరు వివిధ సమస్యలకు పరిష్కారాలను పొందగలుగుతారు. అల్ల నేరేడు పండ్ల ఆకులతో చేసిన టీకి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించే సామర్థ్యం ఉంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల మంచి మూలం. నేరేడు పండు ఆకులతో తయారు చేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి.

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి మీరు నేరుడు పండు ఆకులతో చేసిన టీని తీసుకోవచ్చు. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. నేరేడు పండు ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

నేరేడు పండు ఆకుతో టీ చేయడానికి, ముందుగా 1 కప్పు నీరు తీసుకోండి. దానికి 2 నుంచి 3 నేరేడు ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి అందులో కాస్త తేనె కలుపుకుని తాగాలి. జ్వరం ఉన్నప్పుడు ధనియాల పొడిలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీరతాపం తగ్గుతుంది.

ఈ చెట్టు ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ బలహీనమైన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నేరేడు ఆకులతో చేసిన టీ తాగటం ద్వారా మీరు కాలేయం నుండి మురికి, విషాన్ని తొలగించవచ్చు.

ఈ నేరేడు పండు ఆకులను దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కిలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. ఈ నేరేడు పండు ఆకు రసంలో పసుపును కలిపి దద్దుర్లు ఉన్న చోట పూస్తే ఉపశమనం లభిస్తుంది. నేరేడు పండ్లకు రక్తాన్ని శుద్ధి చేసే గుణంతో పాటు నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే గాయాలు త్వరగా మానుతాయి. జిగుట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాల నేరేడు రసం తీసుకుంటే శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటుంది.




