- Telugu News Photo Gallery Cinema photos Tamil dubbing movies Lal Salaam, Captain Miller not releasing on Sankranti due to lack of theaters
సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు
సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు అడ్జస్ట్ అయ్యేలా కనిపించట్లేదు. ఎంత ప్రయత్నించినా 5 సినిమాకు సరిపోయే స్క్రీన్స్ మన దగ్గర ఉన్నాయా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేమున్నామని డబ్బింగ్ హీరోలు గుర్తు చేస్తున్నారు. మరి పొంగల్‌కు పొరుగు ఇండస్ట్రీ సినిమాలను రానిస్తారా.. వాటికి థియేటర్స్ ఇస్తారా..? అసలు అవి వస్తాయంటారా..? తాను దూర సందులేదు మెడకేమో డోలు అన్నట్లు.. సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటుంటే డబ్బింగ్ సినిమాలు కూడా పండక్కే క్యూ కడుతున్నాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 02, 2024 | 2:30 PM

సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు అడ్జస్ట్ అయ్యేలా కనిపించట్లేదు. ఎంత ప్రయత్నించినా 5 సినిమాకు సరిపోయే స్క్రీన్స్ మన దగ్గర ఉన్నాయా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేమున్నామని డబ్బింగ్ హీరోలు గుర్తు చేస్తున్నారు. మరి పొంగల్‌కు పొరుగు ఇండస్ట్రీ సినిమాలను రానిస్తారా.. వాటికి థియేటర్స్ ఇస్తారా..? అసలు అవి వస్తాయంటారా..?

తాను దూర సందులేదు మెడకేమో డోలు అన్నట్లు.. సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటుంటే డబ్బింగ్ సినిమాలు కూడా పండక్కే క్యూ కడుతున్నాయి. అయితే ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేలా ఉన్నారు నిర్మాతలు. పండక్కి అనువాద చిత్రాలు వాయిదా వేసుకోవడమే మంచిదది దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు.

గుంటూరు కారంతో పాటు హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగా సినిమాలకే సరిపడా స్క్రీన్లు లేక బయ్యర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ టైమ్‌లో కొత్తగా కెప్టెన్ మిల్లర్, అయలాన్, లాల్ సలామ్ లాంటి డబ్బింగ్ మూవీస్‌ను తమ నెత్తి మీద పెట్టొద్దని స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దాంతో ధనుష్, శివకార్తికేయన్, రజినీకాంత్ సినిమాలకు వెయిటింగ్ తప్పేలా లేదు.

గతంలోనూ ఇలాగే డబ్బింగ్ సినిమాలు పండక్కి వచ్చినపుడు ఎలాగోలా మన సినిమాలతో పాటే థియేటర్లు అడ్జస్ట్ చేసారు నిర్మాతలు. కానీ ఈసారి ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఇచ్చేదే లేదంటున్నారు. ఇదే మాట మీద ఉంటే.. ఫస్ట్ టైమ్ తెలుగులో డబ్బింగ్ సినిమాలకు షాక్ తగిలినట్లే.

గుంటూరు కారం, హనుమాన్ వస్తున్న జనవరి 12నే కెప్టెన్ మిల్లర్‌తో పాటు శివకార్తికేయన్ అయలాన్ సినిమాలను విడుదల చేయాలనుకోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. రిలీజ్ డేట్స్ వాళ్లు ప్రకటించినా.. తెలుగు వరకు హోల్డ్‌లో పెట్టడం మినహా చేసేదేం లేదు. హాయిగా వారం ఆగి వస్తామంటే వద్దనే వాళ్లే ఉండరు. అలాక్కాదూ సంక్రాంతికే వస్తామంటే నిరాశ తప్ప ఇంకేం మిగలకపోవచ్చు.





























