- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Game Changer update, shooting to restart from January 17th
Game Changer: గేమ్ ఛేంజర్ అప్‌డేట్.. ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్
అన్ని సినిమాల అప్‌డేట్స్ వస్తున్నాయి ఒక్క గేమ్ ఛేంజర్ తప్ప. న్యూ ఇయర్ కానుకగా ప్రతీ హీరో మా సినిమా ఇంత వరకు వచ్చిందంటూ ఓ క్లారిటీ ఇస్తే.. రామ్ చరణ్ మాత్రం ఎలాంటి న్యూస్ చెప్పలేదంటూ నిట్టూరుస్తున్నారు ఫ్యాన్స్. అయితే వాళ్ల కోసమే గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ తీసుకొచ్చాం మేము. మరి ఆ ముచ్చట్లేంటో ఈ స్టోరీలో చూసేద్దామా..? ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ కాస్త వెనక బడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Updated on: Jan 02, 2024 | 2:10 PM

అన్ని సినిమాల అప్‌డేట్స్ వస్తున్నాయి ఒక్క గేమ్ ఛేంజర్ తప్ప. న్యూ ఇయర్ కానుకగా ప్రతీ హీరో మా సినిమా ఇంత వరకు వచ్చిందంటూ ఓ క్లారిటీ ఇస్తే.. రామ్ చరణ్ మాత్రం ఎలాంటి న్యూస్ చెప్పలేదంటూ నిట్టూరుస్తున్నారు ఫ్యాన్స్. అయితే వాళ్ల కోసమే గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ తీసుకొచ్చాం మేము. మరి ఆ ముచ్చట్లేంటో ఈ స్టోరీలో చూసేద్దామా..?

ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ కాస్త వెనక బడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రాజమౌళి సినిమా వచ్చిన ఏడాదిలోపే కనీసం మరో సినిమా వచ్చుంటే బాగుండేది. కానీ ఏం చేస్తాం శంకర్‌తో సినిమా అంటే అలాగే ఉంటుంది. గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతుండటంతో చరణ్‌కు మళ్లీ లాంగ్ బ్రేక్ తప్పట్లేదు. ఈ విషయంలోనే దర్శకుడు శంకర్‌పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్.

గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ చెప్పాలంటూ శంకర్‌ను అడుగుతుంటే.. అప్పుడప్పుడూ ఆయనే రంగంలోకి దిగి అభిమానులను కూల్ చేస్తున్నారు. ఇండియన్ 2పై ఫోకస్ చేస్తూ.. గేమ్ ఛేంజర్‌ను పట్టించుకోవట్లేదంటూ కొన్ని రోజులుగా శంకర్‌పై గుస్సా చూపిస్తున్నారు ఫ్యాన్స్. అయితే జనవరి 17 నుంచి గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది.

డిసెంబర్ చివరి వారంలో బాచుపల్లిలో మూడ్రోజుల షూట్ జరిగింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు టీం. జనవరి 17 నుంచి చరణ్, కియారాపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నారు శంకర్.

ఇండియన్ 2 షూట్ చివరిదశకు రావడం గేమ్ ఛేంజర్‌కు కలిసొచ్చే విషయమైతే.. ఇండియన్ 3 కూడా ఉండటం కలవరపెట్టే మ్యాటర్. 2024 సెప్టెంబర్‌లో చరణ్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.




