- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran breaks the boundaries with Tillu Square movie poster
Anupama Parameswaran: ఆ విషయంలో హద్దులు చెరిపేసిన అనుపమ పరమేశ్వరన్
కత్తి వాడటం మొదలుపెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు అంటూ ప్రభాస్ చెప్పినట్లు.. రెచ్చిపోవడం మొదలుపెడితే నా కంటే బాగా ఎవరూ రెచ్చిపోలేరు అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇప్పట్నుంచీ ఓ లెక్క అన్నట్లు దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. తాజాగా టిల్లు భాయ్ కోసం మామూలుగా రెచ్చిపోలేదు ఈ మలయాళ కుట్టి. అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికీ ఇలాగే పరిచయం. పేరుకు కేరళ కుట్టి అయినా.. తెలుగమ్మాయిలా నిండుగా కనిపిస్తుంటారు అనుపమ.
Updated on: Jan 02, 2024 | 1:43 PM

కత్తి వాడటం మొదలుపెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు అంటూ ప్రభాస్ చెప్పినట్లు.. రెచ్చిపోవడం మొదలుపెడితే నా కంటే బాగా ఎవరూ రెచ్చిపోలేరు అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇప్పట్నుంచీ ఓ లెక్క అన్నట్లు దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. తాజాగా టిల్లు భాయ్ కోసం మామూలుగా రెచ్చిపోలేదు ఈ మలయాళ కుట్టి.

అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికీ ఇలాగే పరిచయం. పేరుకు కేరళ కుట్టి అయినా.. తెలుగమ్మాయిలా నిండుగా కనిపిస్తుంటారు అనుపమ. కానీ గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉంటే రేసులో ముందుకు వెళ్లడం కష్టం అని ఇన్నాళ్లకు అర్థమైనట్లుంది.. అందుకే ఈ మధ్య కాస్త హద్దులు మీరుతున్నారు అనుపమ.

గతేడాది విడుదలైన రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. అందులో ఆశిష్ రెడ్డితో లిప్ లాక్స్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్‌తో చేసారు అనుపమ. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తూనే ఉన్నారు. తాజాగా టిల్లు స్వ్వేర్‌తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. న్యూ ఇయర్ పోస్టర్ చూస్తుంటే మతులు పోతున్నాయి.

సిద్ధూ జొన్నలగడ్డతో జోడీ అన్నపుడే కచ్చితంగా అనుపమ నెక్ట్స్ లెవల్‌లో రెచ్చిపోతారని ఊహించారు కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు. కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి.

ఇక సిద్ధూ ఎలాగూ ఉండనే ఉన్నారు. ఫిబ్రవరి 9న విడుదల కానుంది టిల్లు స్క్వేర్. మరి చూడాలిక అనుపమ కెరీర్ ఈ సినిమా తర్వాత ఎలాంటి మలుపులు తిరగబోతుందో..?




