ISRO: కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో ప్రయోగం.! ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి..
చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాలలో దూసుకుపోతోంది. 2023 విజయపరంపరను.. కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలనే దృఢ సంకల్పంతో నూతన సంవత్సరం తొలిరోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV-C58 ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ చేసింది. ఈ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి, సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాలలో దూసుకుపోతోంది. 2023 విజయపరంపరను.. కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలనే దృఢ సంకల్పంతో నూతన సంవత్సరం తొలిరోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV-C58 ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ చేసింది. ఈ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి, సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు PSLV-C58 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యం. దీని జీవితకాలం ఐదేళ్లు. ఈ ఎక్స్‌పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్‌లను ఈ వాహకనౌక హోస్ట్ చేస్తుంది. మరోవైపు పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి58, ఎక్స్‌పోశాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.