హైదరాబాద్‌లో పీక్స్‌కి పెట్రోల్ కష్టాలు.. డెలివరీ బాయ్ ఏం చేశాడో చూడండి
ఇదంతా ఇలా ఉంటే సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా రోజూ ఉద్యోగానికి వెళ్లే వారు, ఫుడ్ డెలివరీ బాయ్స్ పెట్రోల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద నిల్చునే..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని భావించిన వాహనదారులు ఒక్కసారిగా బంకులకు క్యూ కట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలం కావడంతో ధర్నాను ఎట్టకేలకు విరమించారు.
ఇదంతా ఇలా ఉంటే సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా రోజూ ఉద్యోగానికి వెళ్లే వారు, ఫుడ్ డెలివరీ బాయ్స్ పెట్రోల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద నిల్చునే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ బంక్ వద్ద గంటల తరబడి పెట్రోల్ కోసం ఎదురుచూడ లేక పాతబస్తీలో జొమాటో బాయ్స్ గుర్రాలపై తిరుగుతూ ఫుడ్‌ను డెలివరీ చేశారు. ఓ వైపు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలైన్.. మరొకొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులతో గత్యంతరం లేక గుర్రాలపై పార్సిల్స్‌ను డెలివరీ చేసినట్లు జొమాటోకు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ చెప్పుకొచ్చారు.
గుర్రంపై ఫుడ్ డెలివరీ చేస్తున్న సదరు వ్యక్తిని అందరూ ఆశ్చర్యంగా చూశారు. తమ స్మార్ట్ ఫోన్స్‌లో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలుకాస్త తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వంతో ట్యాంకర డ్రైవర్ల యూనియన్లు చర్చలు జరిపి సమ్మె విరమస్తున్నట్లు ప్రకటించినా కూడా అర్ధరాత్రి వరకు వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టారు. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో కొంత ఆందోళన నెలకొన్న చివరకు సమ్మె విరమస్తున్నట్లు ప్రకటించడంతో వాహనదారులు కొంత ఊపిరిపీల్చుకున్నారు. యథావిధిగా ట్యాంకర్ల నడవనున్నట్లు తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై పునరాలోచించాలని ట్యాంకర్ డ్రైవర్లు, యజమానులు కోరుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..