Andhra Pradesh: విశాఖ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నమ్మలేని నిజాలు..! ఆ ఇద్దరు కీచకులు ఎక్కడ.?

బాలికపై అత్యాచారం ఫోక్సో కేసులో 11 మంది నిందితులను కోర్టులో హాజరపరిచారు పోలీసులు. ఈనెల 12వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. 11 మంది నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు. మరో ఇద్దరు స ఇమ్రాన్, షోయబ్ కోసం పోలీసులు జార్ఖండ్లో గాలిస్తున్నారు. అత్యాచార ఘటనపై ఫిర్యాదు వచ్చిన తర్వాత ప్రభుత్వం పోలీసులు సత్వరమే స్పందించడంతో.. 48 గంటల్లోనే.. 13 మంది నిందితులలో 11 మందిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు.

Andhra Pradesh: విశాఖ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నమ్మలేని నిజాలు..! ఆ ఇద్దరు కీచకులు ఎక్కడ.?
arrest
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 02, 2024 | 8:53 PM

బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు దిశ పోలీసులు. పోక్సో కేసు నమోదు చేసి ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. 11 మంది నిందితులకు.. ఈ నెల 12 వరకు రిమాండ్‌ విధించింది కోర్ట్‌. మరోవైపు ఘటనకు కారణమైన కీలక నిందితులు ఇమ్రాన్, షోయబ్ కోసం… పోలీసు బృందాలు ఝార్ఖండ్ వెళ్లాయి. అటు.. నిందితులకు ఉరే సరంటూ.. మహిళా సంఘాలు ఆందోళన బాటపట్టాయి.. పోలీసులు ప్రకటన ప్రకారం.. ఒడిశా కలహాండి జిల్లా చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం విశాఖ వచ్చింది. ఆ కుటుంబంలో పదిహేడేళ్ల బాలిక.. ఓ ఇంట్లో పెంపుడు జంతువుల పనికి కుదిరింది. అయితే.. డిసెంబర్ 17న ఇంటి కి తిరిగి రాకపోయే సరికి ఆరా తీసిన పేరేంట్స్.. ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాతి క్రమంలో బాలిక.. ఒడిశా లోని స్వగ్రామం లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు పేరెంట్స్ సహకారంతో విశాఖ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ బాలిక షాక్ లో ఉంది. ఏమి చెప్పలేకపోతోంది. డిసెంబరు 30వరకు షాక్ లోనే ఉన్న బాలిక.. కోలుకుని తల్లి దండ్రులతో అసలు విషయాన్ని చెప్పింది. తనపై అఘాయిత్యం జరిగినట్టు చెప్పడంతో పేరేంట్స్ తీవ్ర ఆవేదనలోకి వెళ్లిపోయారు. 31న పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పేరేంట్స్.. తన కూతురికి జరిగిన అన్యాయంపై పోలీసులకు తెలిపారు. బాధితురాలితో పోలీసులు మాట్లాడి స్టేట్ మెంట్ తీసుకున్నారు. బాలిక స్టేట్ మెంట్ తో పోలీసులే నిర్గాంతపోయారు. ఆమెపై విశాఖలో పలుమార్లు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్టు బాలిక చెప్పడంతో ఆ దిశగా విచారణ ప్రారంభీంచ్చారు పోలీసులు. దీంతో మిస్సింగ్ మొదలైన కేసు.. నిర్బంధం అత్యాచారం తో పాటు పొక్సో మారింది.

బాధిత బాలికను పనిచేసినచోటే మార్బుల్ వర్కర్ గా పనిచేస్తున్న ఇమ్రాన్ .. ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ తరువాత ఆమెను మాయమాటలు చెప్పి.. ఓ గదికి తీసుకెళ్లి లోబర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుడైన షోయబ్ ను ఉసిగొలపాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలిక.. ఆర్కే బీచ్ కి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళింది. అక్కడ రోధిస్తుండగా.. పర్యాటకులకు ఫోటోలు తీసే ఒక యువకుడు.. ఆమెను చూసాడు. భరోసా కనిపిస్తున్నట్టు మాయమాటలో పెట్టి ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ గదిలో బంధించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మరికొంత మంది బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారికి.. మరి కొంతమంది సహకరించారు.

ఆ తర్వాత వాళ్ళ చెర నుంచి తప్పించుకున్న తన స్వగ్రామం ఒడిస్సా కలహాండి జిల్లా లోని స్వాగ్రామం కు వెళ్ళిపోయింది. ఈ లోగా బాలిక కనిపించడం లేదని డిసెంబర్ 17న సాయంత్రం పేరెంట్స్ ఫిర్యాదు చేయడం.. 18వ తేదీన ఫోర్త్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. బాలిక తన స్వగ్రామంలో ఉన్నట్టు తెలుసుకొని పేరెంట్స్ సహకారంతో విశాఖ తీసుకొచ్చారు కౌన్సెలింగ్ చేసి అప్పగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అసలు విషయం పేరెంట్స్ గురించి చెప్పడంతో.. బాధితురాలు స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. పొక్సో సహా అపహరణ, నిర్బంధం సెక్షన్లను కూడా చేర్చారు.

ఇవి కూడా చదవండి

ఫోర్త్ టౌన్ లో నమోదైన కేసును.. దిశ పోలీసులు టేకప్ చేశారు. ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా స్పందించింది. మహిళా కమిషన్.. ప్రత్యేక సూచనలు ఇచ్చింది. అందుకు తగ్గడుగానే పోలీసులు ఈ కేసులో స్పీడ్ అప్ పెంచారు. బాధితురాలికి ధైర్యం చెప్పడంతో పాటు.. నిందితుల వేట మొదలుపెట్టారు. ఈ ఘటనపై మహిళా సంఘాల ఆందోళన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

బాలికపై అత్యాచారం ఫోక్సో కేసులో 11 మంది నిందితులను కోర్టులో హాజరపరిచారు పోలీసులు. ఈనెల 12వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. 11 మంది నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు. మరో ఇద్దరు స ఇమ్రాన్, షోయబ్ కోసం పోలీసులు జార్ఖండ్లో గాలిస్తున్నారు. అత్యాచార ఘటనపై ఫిర్యాదు వచ్చిన తర్వాత ప్రభుత్వం పోలీసులు సత్వరమే స్పందించడంతో.. 48 గంటల్లోనే.. 13 మంది నిందితులలో 11 మందిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు. మరో ఇద్దరిని కూడా పట్టుకొని.. స్పీడు ట్రైలర్ నిర్వహించేలా చేసి నాలుగు నెలల్లో శిక్ష పడేలా చూస్తామని అంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో