AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Sweet Corn Soup: చలికాలంలో వేడిగా చికెన్ స్వీట్ కార్న్ సూప్ తాగితే.. సూపర్ అంతే!

చికెన్ స్వీట్ కార్న్ సూప్.. చాలా మందికి ఇది ఇష్టం. రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లారంటే.. ఖచ్చితంగా దీన్ని ఆర్డర్ చేస్తారు. అందులోనూ చలి కాలంలో ఈ సూప్ తాగితే.. బాడీలో వెచ్చదనం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అయితే ఈ సూప్ తాగడానికి ప్రతి సారీ రెస్టారెంట్లకు వెళ్లలేం కదా. ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట టీ, కాఫీలకు బదులు దీన్ని తాగితే.. టేస్ట్‌తో పాటు ఆరోగ్యం కూడా. ఈ సూప్ చేయడం చాలా సులభం. జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు..

Chicken Sweet Corn Soup: చలికాలంలో వేడిగా చికెన్ స్వీట్ కార్న్ సూప్ తాగితే.. సూపర్ అంతే!
Chicken Sweet Corn Soup
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 03, 2024 | 6:37 PM

Share

చికెన్ స్వీట్ కార్న్ సూప్.. చాలా మందికి ఇది ఇష్టం. రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లారంటే.. ఖచ్చితంగా దీన్ని ఆర్డర్ చేస్తారు. అందులోనూ చలి కాలంలో ఈ సూప్ తాగితే.. బాడీలో వెచ్చదనం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అయితే ఈ సూప్ తాగడానికి ప్రతి సారీ రెస్టారెంట్లకు వెళ్లలేం కదా. ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట టీ, కాఫీలకు బదులు దీన్ని తాగితే.. టేస్ట్‌తో పాటు ఆరోగ్యం కూడా. ఈ సూప్ చేయడం చాలా సులభం. జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తాగితే చాలా మంచిది. మరి ఈ చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ స్వీట్ కార్న్ సూప్‌కి కావాల్సిన పదార్థాలు :

చికెన్, స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, ఫ్రెంచ్ బీన్స్ తరుగు, పంచదార, అరోమేటిక్ పౌడర్, నల్ల మిరియాల పౌడర్, ఉప్పు, తెల్ల మిరియాల పొడి, బీట్ చేసిన గుడ్డు, కార్న్ ఫ్లోర్, ఆయిల్.

చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం:

ముందుగా స్వీట్ కార్న్ గింజల్ని మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లోతైన గిన్నెలో నీళ్లు పోసి అందులో గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్, చికెన్ వేసి ఉడికించు కోవాలి. మధ్యలో పైన వస్తున్న తేటను తీసేస్తూ ఉండాలి. చికెన్ ఉడికిన తర్వాత క్యారెట్, పంచదార, అరోమేటిక్ పౌడర్, ఫ్రెంచ్ బీన్స్ వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కోడి గుడ్డును బాగా బీట్ చేసి.. అది కూడా సూప్ ఉడికే మిశ్రమంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలిపిన కార్న్ ఫ్లోర్‌ని కూడా సూప్‌లో వేసుకోవాలి. దీన్ని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ సిద్ధం. దీన్ని ఈ వింటర్ సీజన్‌లో తీసుకుంటే చాలా మంచిది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్