ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? సురక్షితమైన చిట్కాలు!
ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం తరచుగా లైట్ బల్బులను శుభ్రం చేయడం మర్చిపోతుంటాం. దీనివల్ల బల్బులపై ధూళి, ముఖ్యంగా కిచెన్‌లోని బల్బులపై నూనె, పొగ వంటి జిడ్డు పేరుకుపోయి కాంతి తగ్గిపోతుంది. బల్బులను సురక్షితంగా శుభ్రం చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. శుభ్రం చేయడానికి ముందు ఎల్లప్పుడూ కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి, బల్బ్ పూర్తిగా చల్లబడే వరకు వేచి చూడాలి. బల్బ్‌పై నేరుగా నీరు చల్లకూడదు లేదా కెమికల్స్ ఉపయోగించకూడదు. ఫుల్ డిటెల్స్ ఇప్పుడు చూద్దాం...

ఇల్లు, వస్తువులను శుభ్రపరిచేటప్పుడు మనం నేలలు, ఫ్యాన్లు, కిటికీలు, అద్దాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. కానీ చాలాసార్లు ఇంట్లోని లైట్ బల్బులను క్లీన్ చేయడం మర్చిపోతుంటాం. కాలక్రమేణా బల్బులపై దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. ముఖ్యంగా వంటగదిలో ఉన్న బల్బులపై వంట నూనె ఆవిరి, పొగ కారణంగా జిడ్డు లేదా క్రీజు అంటుకుంటుంది. దీనివల్ల బల్బులు మురికిగా కనిపియడమే కాకుండా, వాటి నుంచి వచ్చే కాంతి కూడా తగ్గిపోతుంది. మీ ఇంట్లోని బల్బులు కూడా ఇలాగే మసకబారితే, కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా వాటిని సరికొత్తగా మెరిపించవచ్చు. అయితే క్లీనింగ్ సమయంలో కొన్ని ముఖ్యమైన భద్రతా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో వివరంగా చూద్దాం..
శుభ్రం చేసే ముందు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు
బల్బ్‌ను శుభ్రం చేయడానికి ముందు మెయిన్ స్విచ్‌ను పూర్తిగా ఆఫ్ చేయండి. కరెంట్ షాక్ తగలకుండా భద్రత పాటించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ వేడిగా ఉన్న బల్బ్‌ను తాకకండి. లైట్ వేసి ఉన్నప్పుడు బల్బ్ వేడెక్కుతుంది. కాబట్టి కరెంట్ ఆಫ್ చేసిన తర్వాత బల్బ్ పూర్తిగా చల్లబడే వరకు కొన్ని నిమిషాలు వేచి చూడండి. ఆ తర్వాతే దానిని హోల్డర్ నుండి సురక్షితంగా బయటకు తీయాలి.
బల్బ్‌పై కేవలం దుమ్ము మాత్రమే ఉంటే, దానిని శుభ్రం చేయడానికి నీరు లేదా ఎలాంటి లిక్విడ్స్ అవసరం లేదు. ఒక మృదువైన, పొడి మైక్రోఫైబర్ గుడ్డను తీసుకుని బల్బ్ పైభాగన్ని మెల్లగా తుడవాలి. దీంతో దుమ్ము సులభంగా తొలగిపోతుంది.
జిడ్డు, మురికిని ఎలా వదిలించుకోవాలి?
కిచెన్ లేదా ఇతర ప్రాంతాల్లోని బల్బులపై నూనె జిడ్డు ఉంటే, బల్బ్ తయారీదారుల సూచనలను గమనించండి. అవసరమైతే, కొద్దిగా మైల్డ్ సోప్ నీటిలో గుడ్డను ముంచి, బాగా పిండాలి. ఆ తేమతో కూడిన గుడ్డతో బల్బ్ ఉపరివిధాన్ని సున్నితంగా తుడవాలి. బల్బ్ బేస్ భాగం లేదా కరెంట్ కనెక్ట్ అయ్యే ఎలక్ట్రానిక్ భాగాలకు నీరు తగలకుండా జాగ్రత్త పడాలి. బల్బులపై నేరుగా బేకింగ్ సోడా, నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆమ్ల పదార్థాలను పూయకండి. ఇది బల్బ్ గ్లాస్ కోటింగ్‌ను దెబ్బతీస్తుంది. బల్బ్‌ను నీటిలో ముంచడం లేదా నేరుగా నీటి స్ప్రే చేయడం చేయకూడదు.
శుభ్రం చేసిన తర్వాత బల్బ్‌లో కాస్త కూడా తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి హోల్డర్‌లో బిగించాలి. బల్బ్ పగిలిపోయినా లేదా పాతదైపోయినా శుభ్రం చేయడానికి బదులు కొత్తది మార్చడం మంచిది.




