AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajeev Kanakala: ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. తన జీవితంలో గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్న రాజీవ్ కనకాల

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల రీసెంట్ గా ఒక ఇంటర్వూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నారు. ఇదే క్రమంలో తన సోదరి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Rajeev Kanakala: ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. తన జీవితంలో గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్న రాజీవ్ కనకాల
Rajeev Kanakala
Basha Shek
|

Updated on: Nov 01, 2026 | 4:27 PM

Share

రాజీవ్ కనకాల.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ కు నటనలో ఓనమాలు నేర్పించిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఇక రాజీవ్ భార్య సుమ కనకాల స్టార్ యాంకర్ గా ఎనలేని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక రాజీవ్ తనయుడు రోషన్ కనకాల కూడా ఇప్పుడిప్పుడే హీరోగా రాణిస్తున్నాడు. ఇక రాజీవ్ కూడా నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సహాయక నటుడగా.. ఇలా విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న రాజీవ్ రీసెంట్ గా ఒక ఇంటర్వూకు హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో తన సోదరిని గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. ‘నా కుటుంబంలో తల్లి, తండ్రి, చెల్లిని కేవలం రెండేళ్ల సమయంలోనే కోల్పోవాల్సి వచ్చింది. మొదట అమ్మను కోల్పోవడం పెద్ద షాక్. ఆమె లేని లోటును భరించడం చాలా కష్టమైంది. ఆమె మరణం కలిగించిన బాధ నుంచి బయటపడకముందే నాన్నను కూడా కోల్పోయాను. దాదాపు 30 నుంచి 32 రోజుల పాటు ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ అందించాం.. కానీ.. నాన్నను కాపాడుకోలేకపోయాం. నాన్న మరణం నన్ను మానసికంగా కుంగదీసింది. ఇక అమ్మానాన్నల మరణాల కంటే చెల్లెలి విషయంలో ఎదుర్కొన్న పరిస్థితులు నన్ను మరింత బాధించాయి. నా చెల్లెలికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. కానీ ఆమె ఈ విషయాన్ని చాలా రోజులు దాచి పెట్టింది. కానీ ఆ విషయాన్ని ఆమె మొదట్లో ఎవరికీ చెప్పుకోలేదు. నా చెల్లెలి విషయంలో క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆలస్యంగా పరీక్షలు చేయించుకోవడంతో వ్యాధి ముదిరిపోయింది. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందించాం. రేడియేషన్ వంటి వైద్య చికిత్సలు కూడా అందించాం. చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిందని వైద్యులు చెప్పడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం.

‘కానీ మళ్లీ పరీక్షలకు వెళ్లినప్పుడు నా సోదరికి క్యాన్సర్ తిరిగి వచ్చినట్లు చెప్పడంతో షాక్ అయ్యాం. అంతేకాదు నాలుగో స్టేజ్ అని, వెన్నుపూస వరకు క్యాన్సర్ వ్యాపించడంతో నా చెల్లెలి పరిస్థితి మరింత దారుణంగా మారింది. వెన్నుపూస దగ్గర ఎముకలు దెబ్బతినడంతో ఆమె కనీసం కూర్చోలేకపోయింది. నడవడం కూడా కష్టంగా మారింది. నొప్పిని తగ్గించడానికి మందులు ఇచ్చినా కొద్ది సేపటి వరకే ఆ ప్రభావం ఉండేది. ఇక కరోనా సమయంలో మరింత క్షోభ అనుభవించాం. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని డాక్టర్స్ చెప్పడంతో ఏం చేయలేకపోయాం. నేనేతై రాత్రి వేళళ్లో నిద్ర కూడా పోయేవాన్ని కాదు. చెల్లెలి గదిలో నుంచి ఏదైనా శబ్దం వినిపిస్తుందేమోనని తలుపు దగ్గర నిలబడి చూస్తుండే వాడిని. ఆ సమయంలో నేను ఏడు రోజులు నిద్రలేకుండా గడిపాను’ అని అప్పటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నారు రాజీవ్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్