AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ హత్యలు చేసిందెవరు? ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

అక్టోబర్ 02న థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం సినిమా అక్కడి ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. కలెక్షన్ల పరంగానూ పర్వాలేదనిపించింది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 8.4/10 ఉండగా బుక్ మై షోలో 7.9/10 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: ఆ హత్యలు చేసిందెవరు? ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 01, 2026 | 3:19 PM

Share

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు. ప్రధానంగా ఓటీటీలో మలయాళం సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు రికార్డ్ స్ట్రీమింగ్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సినిమా గురించే. ఇది కూడా ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. అక్టోబర్ 02న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 8.4/10 ఉండగా బుక్ మై షోలో 7.9/10 రేటింగ్ దక్కడం విశేషం. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా కథ అంతా ఓ నగరంలో జరిగే వరుస అనుమానాస్పద హత్యల చుట్టూ తిరుగుతుంది. మొదట డ్రగ్ డీలర్ జస్టిన్, ఆ తర్వాత వ్యాపారవేత్త బోబన్ వరుసగా దారుణ హత్యకు గురవుతారు. ఈ సీరియల్ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ డివైఎస్పీ క్రిస్టీ రంగంలోకి దిగుతాడు. అయితే విచారణలో ఆయనకు పెద్దగా ఆధారాలేమీ లభించవు. దీంతో సైకో పాత్స్, సీరియల్ కిల్లర్స్ మనస్తత్వాలను విశ్లేషించడంలో నేర్పరి అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ స్వామి సహాయాన్ని క్రిస్టీ తీసుకుంటాడు. మరి అసలు ఆ ఇద్దరినీ చంపిన కిల్లర్ ఎవరు? అసలు ఆ మర్డర్స్ వెనక ఉన్న మోటివ్ ఏంటి? మూడో హత్య జరగకుండా పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా మిగతా కథ.

థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా పేరు ‘ది థర్డ్ మర్డర్’ (The Third Murder). దర్శకుడు సునీల్ ఇబ్రహీం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సైజు కురుప్, ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్‌లతో పాటు అనన్య, మణికందన్ పటాంబి, లియోనా లిషాయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘మనోరమ మ్యాక్స్’, ‘సింప్లీ సౌత్’ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 13 నుంచి ‘ది థర్డ్ మర్డర్’ సినిమా ఓటీటీలోకి రానుంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
Follow Us
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..