Hair Dye :కరివేపాకు హెయిర్ డై.. 5 రోజుల్లో గ్రే హెయిర్ కి గుడ్‌ బై చెప్పండి..

కరివేపాకు అనేక స్కాల్ప్, హెయిర్ సమస్యలకు పరిష్కారంగా చెబుతున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. జుట్టు బలంగా మారటానికి, జుట్టు రాలడాన్ని తిరిగి పెంచడానికి ఇది మంచిది. ముఖ్యంగా తాత్కాలికంగా పోయిన జుట్టును తిరిగి తీసుకురావడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు..చాలా కాలం నుండి జుట్టు రాలిన వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్, పేగు ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా మంచిది.

Hair Dye :కరివేపాకు హెయిర్ డై.. 5 రోజుల్లో గ్రే హెయిర్ కి గుడ్‌ బై చెప్పండి..
Curry Leaves Pack For Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 03, 2024 | 3:52 PM

గ్రే హెయిర్.. అనేది ఈ రోజుల్లో చాలా మంది యువత ఎదుర్కోంటున్న అతి ముఖ్యమైన సౌందర్య సమస్య. చాలా మంది ఈ సమస్యకు పరిష్కారం కోసం అనేక మార్గాలు ప్రయత్నించారు. చాలా మంది మార్కెట్లో లభించిన ఆర్టిఫిషియల్ హెయిర్ డైస్ వాడుతుంటారు. ఇందులో ఉండే రసాయనాలు మీ జుట్టుతో పాటు ముఖ సౌందర్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అందుకే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా, గ్రేహెయిర్‌ సమస్యను పరిష్కరించడానికి మనం ఉపయోగించే సహజ మార్గాలు ఉన్నాయి. అలాంటి నేచురల్‌ హెయిర్ డైని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రధానంగా కావాల్సిన పదార్ధం కరివేపాకు.

కరివేపాకు శరీర ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, బీటా కెరోటిన్, ఐరన్ ఉంటాయి. ఇది యాంటీమైక్రోబయల్ కూడా. అంటే బాక్టీరియా, ఫంగల్ సమస్యలకు కూడా ఇది మంచి మందు. అందుకే కరివేపాకు అనేక స్కాల్ప్ మరియు హెయిర్ సమస్యలకు పరిష్కారంగా చెబుతున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. జుట్టు బలంగా మారటానికి, జుట్టు రాలడాన్ని తిరిగి పెంచడానికి ఇది మంచిది. ముఖ్యంగా తాత్కాలికంగా పోయిన జుట్టును తిరిగి తీసుకురావడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు..చాలా కాలం నుండి జుట్టు రాలిన వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్, పేగు ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా మంచిది.

కరివేపాకును జుట్టుకు చాలా రకాలుగా ఔషధంగా ఉపయోగించవచ్చు. కరివేపాకును నూనెలో వేసి మరిగించి జుట్టుకు అప్లై చయవచ్చు. అలాగే, కరివేపాకుతో ఒక ప్రత్యేక హెయిర్ డై తయారు చేసుకుని ఉపయోగించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్రేహెయిర్‌ ని నల్లగా మార్చడానికి, తెల్ల జుట్టు సమస్యను నిరోధించడానికి సహాయపడుతుంది. దీనికి రెండు పదార్థాలు మాత్రమే అవసరం. దీని కోసం కరివేపాకు, దానిమ్మ లేదా దానిమ్మ తొక్క అవసరం.

ఇవి కూడా చదవండి

కరివేపాకుతో హెయిర్‌ డై తయారు చేయటానికి…

ముందుగా.. మంచి శుభ్రమైన కరివేపాకు తీసుకోండి. కడిగి ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును ఇనుప పాత్రలో బాగా వేడి చేయాలి. ఆ తర్వాత చేత్తో నలిపితే పొడిగా అవుతుంది. ఆ తర్వాత దానిమ్మ లేదంటే దానిమ్మ తొక్కలను తీసుకోవాలి. ఇది జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. దానిమ్మ తొక్కలను కూడా బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన దానిమ్మ తొక్కలను మెత్తగా రుబ్బుకోవాలి. లేదంటే.. దాన్ని తొక్కలను తీసుకుని కొన్ని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ నీరు నీలం రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఈ నీటిలో కరివేపాకు పొడిని కలపాలి.

దీనికి మీరు ఉసిరికాయ పొడి, గోరింట, కలోంజీ, టీ పొడి లేదంటే, కాఫీ పొడిని కలపవచ్చు. ఇలా అన్ని పొడులను సమాన పరిమాణంలో తీసుకోవచ్చు. ఇలా అన్ని పౌడర్లను సమానంగా తీసుకుని.. ఇనుప కెటిల్‌లో వేసి బాగా కలపాలి.. ఈ మిశ్రమాన్ని ఓ రెండు మూడు గంటలపాటు మూతపెట్టి పక్కనపెట్టాలి..ఆ తర్వాత మీ తెల్లజుట్టు అప్లై చేయాలి. దీన్ని మీ జుట్టుకు పట్టించి 2 గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. కావాలంటే మీరు తేలికపాటి షాంపూని ఉపయోగించవచ్చు. ఇది ప్రతి రెండు వారాలకు ఒకసారి చేయవచ్చు. ఇలా చేస్తే.. వెంట్రుకల పెరుగుదలకు, జుట్టు నల్లబడటానికి మరియు అకాల నెరవడం నివారణకు మంచిది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు, మీరు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి. ఒకసారి ప్యాచ్ టెస్ట్ కూడా చేయండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..