Black Salt Vs Pink Salt: రంగు మారుతున్న ఉప్పు.. పింక్ సాల్ట్ vs బ్లాక్ సాల్ట్.. ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
పాకిస్తాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో దొరకే రాక్ బ్లాక్ సాల్ట్‌కు మరింత అదరణ లభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచించడంతో, పబ్లిక్ కొనడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నారు. గతంలో ఇలాంటి సాల్ట్ బడా షాపింగ్ స్టార్స్ సూపర్ మార్కెట్లలో దొరికేది. కానీ ఇప్పుడు రోడ్ సైడ్ బండ్లలోనూ పింక్ బ్లాక్ సాల్ట్ దర్శనమిస్తోంది.

రాక్ సాల్ట్ సూపర్ మార్కెట్లు పెద్ద పెద్ద స్టోర్లలో దొరికేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో రోడ్ల సైడ్ టక్కులలో పెట్టి పంజాబ్, హర్యానా, రాష్ట్రాల వ్యాపారులు పింక్, బ్లాక్ సాల్ట్ స్టోన్ ను సేల్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ లవణానికి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు వ్యాపారులు. రోజుకు 70 నుండి 80 కిలోల చొప్పున అమ్ముతున్నామని అంటున్నారు.. కేజీ బ్లాక్ సాల్ట్ కు 100 రూపాయలు, పింకు సాల్ట్ కు 80 రూపాయల రేటు ఫిక్స్ చేసి సెల్స్ చేస్తున్నామని తెలిపారు. ఈ ఉప్పు రాయిని పాకిస్తాన్, పంజాబ్, హర్యానా, రాష్ట్రాల నుండి తీసుకొచ్చి భాగ్యనగరంలో లింగంపల్లి, మెహిదీపట్నం, నాంపల్లి, ఉప్పల్, రాజేందర్ నగర్, జీడిమెట్ల, తదితర ఏరియాలలో వ్యాపారం చేస్తున్నారు.
వైట్ ఉప్పుతోని రాక్ సాల్టును పోలిస్తే, ఇందులులో ఎక్కువ శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఖనిజ లవణాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియమే కాకుండా ఎన్నో మినరల్స్ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారని అంటున్నారు పబ్లిక్. ఈ సాల్ట్ హెల్త్ కు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి పెరిగి షుగరు బీపీ వంటివి కంట్రోల్ చేసుకోవచ్చటున్నారు.
పింక్, బ్లాక్ సాల్ట్ రేట్లు సూపర్ మార్కెట్లతో పోలిస్తే రోడ్ సైడ్‌ల్లో చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు సిటిజన్లు. సూపర్ మార్కెట్లలో పింక్ సాల్ట్ కేజీ 300 నుండి 400 రూపాయలు, బ్లాక్ సాల్ట్ కేజీ 500 నుండి 600 రూపాయలు ఉంటుందని తెలిపారు కస్టమర్లు. తెల్ల ఉప్పు లాగా రాక్ సాల్టులో కల్తీ ఉండదు అంటున్నారు పబ్లిక్. పింకు బ్లాక్ సాల్ట్ పేస్ట్ తక్కువ మందికి తెలుసు. ఎక్కువగా తెలవదని.. ఇది తినడం ఎంతో మంచిదని కొంటున్నామంటున్నారు నిపుణులు.
హైదరాబాద్ సిటీతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా తక్కువ ధరలకు పింక్, బ్లాక్ సాల్ట్ ను సేల్స్ చేస్తున్నాం అంటున్నారు వ్యాపారులు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…