Health: తరచూ మూత్రవిసర్జన షుగర్ లక్షణం మాత్రమే కాదు.. ప్రాణాంతక వ్యాధికి కూడా సూచన
ప్రజలు తరచుగా మూత్రవిసర్జన సమస్యకు డయాబెటిస్ కారణమని భావిస్తారు.. అయితే ప్రతి సందర్భంలో ఈ లక్షణం మధుమేహం కాదు. మెడికల్ జర్నల్ ది లాన్సెట్ చేసిన పరిశోధన ప్రకారం, తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కారణమయ్యే విస్తారిత ప్రోస్టేట్ లక్షణం కావొచ్చని చెబుతున్నారు...
తరచూ మూత్ర విసర్జన చాలా మందిలో సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యే. కొన్ని సందర్భాల్లో ఇది పెద్దగా ఇబ్బంది కాకపోయినప్పటికీ, మరికొన్ని సమయాల్లో మాత్రం ఆరోగ్య సంబంధిత సమస్యలకు కారణంగా భావించాలని నిపుణులు చెబుతుంటారు. పదే పదే మూత్ర విసర్జన అనగానే చాలా మంది డయాబెటిస్‌గా భావిస్తుంటారు. నిజానికి తరచుగా మూత్ర విసర్జన అనగానే ఎవరైనా డయాబెటిస్‌గానే భావిస్తారు. అయితే ఇది మరికొన్ని ప్రమాదకర అనారోగ్య సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో తరచుగా మూత్ర విసర్జ కొన్ని సందర్భాల్లో ప్రాతాంతక ప్రోస్టెట్ క్యాన్సర్‌కు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అనురాగ్ కుమార్ ఈ విషయమై మాట్లాడుతూ.. ప్రజలు తరచుగా మూత్రవిసర్జన సమస్యకు డయాబెటిస్ కారణమని భావిస్తారు.. అయితే ప్రతి సందర్భంలో ఈ లక్షణం మధుమేహం కాదు. మెడికల్ జర్నల్ ది లాన్సెట్ చేసిన పరిశోధన ప్రకారం, తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కారణమయ్యే విస్తారిత ప్రోస్టేట్ లక్షణం కావొచ్చని చెబుతున్నారు. 2 వేల మంది రోగులపై జరిపిన పరిశోధనలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. తరచుగా మూత్రవిసర్జన ఉన్న వారిలో మధుమేహం సమస్య లేనట్లయితే.. సదరు వ్యక్తి పీఎఫ్‌ఏ పరీక్షను చేయించుకోవాలని సూచిస్తున్నారు. పురుషుల్లో వచ్చే క్యాన్సర్స్‌లో రెండో ప్రధానమైంది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు..
మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందిగా ఉన్నా, తరచుగా అలాగే.. అత్యవసరంగా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక మూత్రంలో రక్తం రావడం కూడా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు లక్షణాలుగా చెప్పొచ్చు. పెరుగుతున్న వయస్సుతో ఈ లక్షణాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ లక్షణాలు సాధారణంగా క్యాన్సర్ చివరి దశలో మాత్రమే తెలుస్తాయి. 40 ఏళ్లు దాటిన వారిలో తరచుగా మూత్ర విసర్జన సమస్య వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..