- Telugu News Photo Gallery Thrissur’s women eagerly anticipate PM Modi’s arrival to just catch a glimpse of him
PM Modi: కేరళ మహిళలు ఉత్సాహం ప్రశంసనీయం: ప్రధాని మోదీ
గత పదేళ్లలో తమ ప్రభుత్వం మహిళలకు గౌరవం కల్పించేందుకు ఎన్నో పెద్ద పనులు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించింది మా ప్రభుత్వం అని అన్నారు. దేశంలో నాలుగు కులాలు మాత్రమే ముఖ్యమైనవి.. పేదలు, రైతులు, యువత, మహిళలు, వారి సంక్షేమమే మా ప్రభుత్వం ప్రాధాన్యత అని ప్రధాని అన్నారు..
Subhash Goud | Edited By: Ram Naramaneni
Updated on: Jan 03, 2024 | 6:25 PM

PM Modi: మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని త్రిసూర్ చేరుకున్నారు. ఇక్కడ జరిగిన 2 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళ అభివృద్ధిలో మహిళల సహకారం గురించి మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో కేరళ కుమార్తెలు పెద్దన్న పాత్ర పోషించారని ప్రధాని అన్నారు. కేరళ మహిళలు ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆశీస్సులు అందించిన మహిళా శక్తికి కృతజ్ఞతలు తెలిపారు మోదీ.

గత పదేళ్లలో తమ ప్రభుత్వం మహిళలకు గౌరవం కల్పించేందుకు ఎన్నో పెద్ద పనులు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించింది మా ప్రభుత్వం అని అన్నారు. దేశంలో నాలుగు కులాలు మాత్రమే ముఖ్యమైనవి.. పేదలు, రైతులు, యువత, మహిళలు, వారి సంక్షేమమే మా ప్రభుత్వం ప్రాధాన్యత అని ప్రధాని అన్నారు.

ప్రధాని మోదీ ‘స్త్రీ శక్తి సమాగమం’లో ప్రసంగించారు. ఈరోజు త్రిసూర్ నుంచి వచ్చే సందేశం దేశంలోని ప్రతి మూలకు చేరుతుందని ఆయన అన్నారు. కేరళ మహిళలు ప్రదర్శించిన ఉత్సాహం ప్రశంసనీమన్నారు. ప్రధాని మోదీని చూసేందుకు ఆయన అభిమానుల్లో చాలా ఉత్సాహం కనిపించింది.

ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కేరళలోని బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది మహిళలు ఇక్కడికి వచ్చి ప్రధానికి ఘనస్వాగతం పలికారు. కేరళలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మహిళా ర్యాలీ 'స్త్రీ శక్తి సమాగం' అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

తమిళనాడు, లక్షద్వీప్‌లకు బహుమతి: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా కేరళలోని త్రిసూర్ కంటే ముందు జనవరి 2న తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేశారు.

తమిళనాడుకు రూ.19,850 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తమిళనాడు తర్వాత లక్షద్వీప్‌కు రూ.11,50 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని కానుకగా ఇచ్చారు.





























