ఇది ఆ అయోధ్య రాముడు నడయాడిన నేల.. భక్తులు పరవశించే పర్ణశాల.. నేటికీ నాటి ఆనవాళ్లు..

ఐదు మర్రి చెట్లు కలిగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తమ్ముడు లక్ష్మణస్వామికి ఇక్కడే తమకు కుటీరాన్ని నిర్మించాలని ఆదేశించాడు ఆ శ్రీరాముడు.. దాంతో లక్ష్మణస్వామి దండకారణ్యం నుంచి వెదురు బొంగులను తీసుకువచ్చి కుటీరాన్ని నిర్మించారు. సీతా సమేత రామలక్ష్మణులు ఇక్కడే నివాసించారు.  అదే నేడు పంచవటి పర్ణశాలగా ప్రసిద్ధిగాంచింది.

ఇది ఆ అయోధ్య రాముడు నడయాడిన నేల.. భక్తులు పరవశించే పర్ణశాల.. నేటికీ నాటి ఆనవాళ్లు..
Parnashala
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 03, 2024 | 7:12 PM

ఖమ్మం జిల్లా, జనవరి 03; ఆకట్టుకునే చారిత్రాత్మక ఆనవాళ్ళు ఎన్నో… ఆహ్లాదకరవాతావరణంలో పర్ణశాల పుణ్యక్షేత్రం.. రామాయణ ఘట్టాలను జ్ఞాప్తికి తెచ్చేలా దృశ్యాలు.. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న దుమ్ముగూడెం మండలం వర్ణశాల పుణ్యక్షేత్రం భక్తులను పరవశింపజేస్తుంది. భద్రాచలం పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నదుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పుణ్యక్షేత్రం ఉంది. పర్ణశాలలో వెలసి ఉన్న సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయానికి అనేక ప్రాంతాల నుండి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి,  వర్ణశాలను సందర్శించి స్వామి వారిని దర్శిందుకుంటుంటారు.

పవిత్ర గోదావరి నదీ తీరంలో సీతాలక్ష్మణ సమేతుదైన శ్రీరాముడు వెలసిన పుణ్యక్షేత్రం వర్ణశాల. ఎందరో ఋషులు, మునులు, యోగులకు నిలయమైన నిత్య స్వాధ్యాయ జపతపో హోమారి పుణ్యకరులచే పావనడుగు నేల వర్ణశాలు, తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞను తలవాల్చి త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై 14 సంవత్సరాల వనవాసం చేశాడు. ఆ వనవాస కాలంలో చివరి రెండున్నర సంవత్సరాలు వర్షకాలంలో ఇక్కడే గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో ఇక్కడి పర్ణశాల ప్రాంతం దండకారణ్యంగా పిలువబడేది. శ్రీరామచంద్రుడు చివరి రెండున్నర సంవత్సరాల పాటు వనవాసం చేయుటకు సరైన స్థలాన్ని చూపించాల్సిందిగా ఆగస్త్య మహర్షిని అర్థిస్తాడు. మహర్షి సూచన మేరకు దక్షిణాదిన గౌతమీ నదీ తీరాన పయన్ని నదీ తీరంలోని ఐదు మర్రిచెట్లు కలిగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వనవాసం చేయుటకు అనువైన ప్రదేశంగా సూచించారు.

దీంతో శ్రీరాముడు సీతాలక్ష్మణసమేతుడై గౌతమీ నదీ తీరాన దక్షిణాధి వైపు పయనిస్తూ ఐదు మర్రి చెట్లు కలిగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తమ్ముడు లక్ష్మణస్వామికి ఇక్కడే తమకు కుటీరాన్ని నిర్మించాలని ఆదేశిస్తారు. దీంతో లక్ష్మణస్వామి దండకారణ్యం నుంచి వెదురు బొంగులను తీసుకువచ్చి కుటీరాన్ని నిర్మించారు. సీతా సమేత రామలక్ష్మణులు ఇక్కడే నివాసించారు.  అదే నేడు పంచవటి పర్ణశాలగా ప్రసిద్ధిగాంచింది. రావణాసురుడి సోదరి అయిన సూర్పణక్క కారణంగా కరదూషణ త్రిశిర సాధి 14వేల రాక్షసులతో విరోధం ఏర్పడి వారితో శ్రీరాముడు యుద్ధం చేసి వారిని సంహరిస్తాడు.

ఇవి కూడా చదవండి

యుద్ధం జరిగిన ప్రాంతానికి దుమ్మిగూడెంగా పేరుగాంచి నేడు దుమ్ముగూడెంగా పిలువబడుతుంది. రావణాసురుడి పేరుతో మాయ లేడిగా వచ్చిన మారీచుని సంహారం, రావణుడి సీతాపాహరణం, సీతను విడిపించాలని రావణుడితో పోరాడిన జటాయువు మరణం తదితర పురాణ ఘట్టాలు ఇక్కడే జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తాయి.

పురాణగాథల్లో చెప్పిన విధంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారు పర్ణశాలలో కుటీరం ఏర్పరుచుకుని కుటీర సమీపంలో సీతవాగు వద్ద సీతమ్మవారి నారచీరల ప్రదేశం, శ్రీరాముని రాతి సింహాసనం, సీతవాగులోని పసుపు, కుంకుమ రాళ్ళు తదితర ఆనవాళ్ళు ఎన్నో నేటికి భక్తులకు దర్శనమిస్తుంటాయి. సీతమ్మవాగు ప్రత్యేక పరిస్థితుల్లో స్నానం ఆచరించుటకు తగిన నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయుటకు తమ్ముడు లక్ష్మణుడిని ఆదేశించగా ఉత్తరం వైపు గుట్టకు లక్ష్మణుడు బాణం సంధించగా ఆ గుట్టకు రంద్రం ఏర్పడి గుట్టలో నుండి నీటి ప్రవాహం ఉద్భవించి వర్ణశాల వైపు నీళ్ళు పారినట్టుగా చెబుతారు. దానినే సీత వాగు అని పిలుస్తుంటారు. 365 రోజుల పాటు నిత్యం ఆ వాగులో నీళ్ళు ప్రవహిస్తుంటాయి. ఇక్కడే ఆ సీతమ్మవారు స్నానం ఆచరించి నార చీరను ఆరబెట్టుకున్న ఆనవాళ్లు నేటికి కనపడుతుంటాయి. సీతారామచంద్రస్వామి వార్లు ఆడుకున్న వామన గుంటలు, రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం, రాముని వారి పాదాలు, తదితర దృశ్యాలు సీతవాగు వద్ద భక్తులను పరవశింప జేస్తాయి.

ఆకర్షణీయంగా పంచవటి కుటీరం.. పర్ణశాలలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం పక్కనే పంచవటి కుటీరం ఉంది. ఈ పచవటి కుటీరంలో సీతారామలక్ష్మణ స్వామి విగ్రహాలు, సీతమ్మవారి పాదాలు, రావణాసురుడు కుటీరం వద్దకు భిక్షాటన చేయుటకు వచ్చిన దృశ్యాలు, సీతమ్మవారు రావణాసురుడి నిజస్వరూపం చూసి మూర్చపోగా రావణాసురుడు భూమిని పేకలించి సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళే దృశ్యాలు విగ్రహ రూపంలో భక్తులను ఆకర్షిస్తున్నాయి. అలాగే పర్ణశాల దేవాలయం పక్కనే గౌతమీ నది ప్రవాహం సుందరమైన దృశ్యాలు ఆహ్లాదకర వాతావరణం భక్తులకు ఎంతో ఆనందాన్ని పంచుతాయి.. ఈ పుణ్యక్షేతంలో సీతమ్మవారికి ప్రాధాన్యం ఉండడం వల్ల దీనికి శ్రీక్షేత్రం అని పేరు. ఇక్కడ ప్రవాహించే గోదావరి నది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

భద్రాచలం దేవాలయానికి అనుబంధంగా ఉన్న వర్ణశాల పుణ్యక్షేత్రంగా భద్రాచలం దేవాలయంలో నిర్వహించే కైంకర్యాలు ఈ క్షేత్రంలో కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అధ్యయనోత్సవాలు గోదావరి నదీ తీరంలోని స్వామి వారి తెప్పోత్సవం, శ్రీస్వామి వారి ఉత్తరద్వార దర్శనంతో పాటు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ స్వామి వారి కళ్యాణం నిర్వహించే ముహూర్తానికి పర్ణశాలలో కూడా శ్రీస్వామి వారికి అంగరంగవైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తుంటారు. స్వామి వారి దర్శన సమయాలు కూడా భద్రాచలంలోని దేవాలయంలో భక్తులకు కల్పించే దర్శన సమయాలు వర్ణశాలలో కూడా అదే సమయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తుంటారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…