Dog Eats 4000 Dollars Cash: యజమానికి షాకిచ్చిన పెంపుడు కుక్క.. రూ. 3 లక్షలకు పైగా మింగేసింది.. ఎలా బయటకు తీశారో తెలిస్తే వాక్‌..!

తమ జీవితంలో ఇలాంటి పని చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని వాపోయారు ఆ దంపతులు. తమ 7 ఏళ్ల కుక్క నోట్లు తింటోందని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను, కానీ నిజంగా అది ఇలా చేయడం చూస్తే నాకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినట్టుగా అనిపించిందని మహిళ క్యారీ లా తెలిపింది. తమ కుక్క ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని చెబుతూనే.. ఇకపై తాము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు.

Dog Eats 4000 Dollars Cash: యజమానికి షాకిచ్చిన పెంపుడు కుక్క.. రూ. 3 లక్షలకు పైగా మింగేసింది.. ఎలా బయటకు తీశారో తెలిస్తే వాక్‌..!
Dog Eats 4000 Dollars Cash
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2024 | 5:03 PM

కుక్క అత్యంత విశ్వాసం గల జంతువు.. కుక్కలతో కొందరికి ఉన్న అనుబంధం ఎంతగా ఉంటుందంటే వాటిని తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు విశ్వాసం, నమ్మకం గల కుక్కలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఓ పెంపుడు కుక్క చేసిన పని యజమానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంటికి విశ్వాసంగా కాపలా కాసే కుక్క దానికున్న అలవాటుతో యజమానికి ధననష్టం తీసుకొచ్చింది. అది చేసిన పనికి ఆ యజమాని పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. కుక్క చేసిన పనికి దానిని కొట్టలేక తిట్టలేక దిక్కుతోచని స్థితిలో యజమాని లబోదిబోమంటున్నారు ఆ దంపతులు. అసలు ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

పెన్సిల్వేనియాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ కుక్క యజమాని తన ఇంట్లో ఉంచిన $4,000 (3,32,640.80 Indian Rupee) నోట్ల కట్టలను వారి పెంపుడు కుక్క మాయం చేసింది. ఇది చూసి కుక్క యజమానులు క్లేటన్, క్యారీ లా షాక్ అయ్యారు. ఇంట్లో పెట్టిన డబ్బు మాయం కావటంతో ఆ దంపతులుకు ఏమీ అర్థం కాలేదు.. నిశితంగా పరిశీలించగా, తమ పెంపుడు కుక్క ఆ నోట్లను నమిలేసినట్టుగా గుర్తించారు. కానీ, వారి పెంపుడు కుక్క ఎప్పుడు ఇంట్లో వస్తువులను కూడా పాడు చేయనందున తన కుక్క అలాంటి పని చేస్తుందని వారు తొలుత నమ్మలేదు. కానీ, అక్కడ కనిపించిన పరిస్థితిని బట్టి చూస్తే.. కుక్క కరెన్సీ నోట్లను ఆకలి తీరేంతవరకు తినేసింది.. మిగిలిన చించివేసిందని గమనించారు.. దాంతో కుక్క మింగిన నోట్లను వెలికి తీయడానికి విచిత్రమైన మార్గం ఎంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

కుక్క కరెన్సీ నోట్లను తిని మిగిలిన నోట్లను చించివేసిందని గుర్తించిన దంపతులు వెంటనే తమ కుక్కతో పశు వైద్యుడి వద్దకు వెళ్లారు. కుక్క బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. అనంతరం ఇద్దరూ బ్యాంకుకు వెళ్లారు. నోట్ల సీరియల్ నంబర్లు దొరికితే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పారు. దీంతో ఆ జంట చిరిగిన నోట్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇందుకోసం కుక్క మలాన్ని, వాంతిని కూడా ఎత్తుకుని అందులోని నోట్ల కోసం వెతకడం మొదలుపెట్టారు.

View this post on Instagram

A post shared by Carrie Law (@ooolalaw)

అలా ఎన్నో గంటల పాటు కష్టపడ్డారు..చివరకు ఈ జంట $3,550 (రూ. 2 లక్షల 95 వేల 137) విలువైన నోట్లను కనిపెట్టారు. వాటిలో కొన్ని నోట్ల సీరియల్‌ నెంబర్లను సేకరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కుక్క మలం కడుగుతూ నోట్లను వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. తమ జీవితంలో ఇలాంటి పని చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని వాపోయారు ఆ దంపతులు. తమ 7 ఏళ్ల కుక్క నోట్లు తింటోందని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను, కానీ నిజంగా అది ఇలా చేయడం చూస్తే నాకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినట్టుగా అనిపించిందని మహిళ క్యారీ లా తెలిపింది. తమ కుక్క ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని చెబుతూనే.. ఇకపై తాము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..