Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Laddu : అయోధ్య రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు.. లక్ష లడ్డూలు సరఫరా..

మరో 17 రోజుల్లో భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన రామాలయం భక్తులకు అందుబాటులోకి రానుంది.. ఇప్పటికే అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు, తిరుపతి ట్రస్ట్ అయోధ్యలోనూ లార్డ్ వేంకటేశ్వర దేవాలయం ప్రతిరూప ఆలయ నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది.

Tirupati Laddu : అయోధ్య రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు.. లక్ష లడ్డూలు సరఫరా..
Tirupati Laddu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2024 | 3:24 PM

అయోధ్య రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు వెళుతున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో ముందుండే TTD, ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కోసం కూడా తన వంతు తోడ్పాటు అందిస్తోంది. జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 22న అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డులు పంపుతున్నామని చెప్పారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట, రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇస్తారు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు. అయోధ్యలో జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భాగంగా ధర్మారెడ్డి మాట్లాడారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నామని, ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు నకిలీ వెబ్‌సైట్లకు శ్రీవారి భక్తులు మోసపోవద్దని సూచించారు. ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి సౌకర్యాలను అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.inలో మాత్రమే బుక్ చేసుకోవాలని ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

మరో 17 రోజుల్లో భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన రామాలయం భక్తులకు అందుబాటులోకి రానుంది.. ఇప్పటికే అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు, తిరుపతి ట్రస్ట్ అయోధ్యలోనూ లార్డ్ వేంకటేశ్వర దేవాలయం ప్రతిరూప ఆలయ నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకించి టీటీడీ ట్రస్టు వారి శ్రీవెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని యోచిస్తున్న టీటీడీ ఇప్పటికే జమ్మూ, న్యూఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని కురుక్షేత్రలో ఆలయాలను నిర్మించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..