Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మిడ్ డే ఎగ్ ప్రాబ్లమ్.. మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..! కారణం ఏంటంటే..

karimnagar: ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు సరఫరా ఆగిపోయింది.. విద్యార్థులకు ఫౌష్టికాహారం అందించేందుకు... వారంలో మూడు రోజులు గుడ్డు అందించాలని... ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ పథకంలో భాగస్వామ్యమవుతున్నాయి.. అయితే.. మధ్యాహ్నా భోజన కార్మికులకు.. ఆరు నెలల నుంచీ వేతనాలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా.. ఇటీవల..

Telangana: మిడ్ డే ఎగ్ ప్రాబ్లమ్.. మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..! కారణం ఏంటంటే..
Mid Day Meals
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jan 08, 2024 | 12:48 PM

కరీంనగర్, జనవరి 05; మద్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్డు… ఇవ్వడం బంద్ చేశారు.. 20 రోజుల నుంచీ గుడ్డు పంపిణీ చేయడం లేదు… ఇటీవల కోడిగుడ్డు ధరలు పెరుగుతున్నాయి… ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో… కోడిగుడ్డు ధర / రూపాయాల వరకు ఉంది.. ప్రభుత్వం మాత్రం 5 రూపాయాల మాత్రమే ఇస్తుంది.. దీంతో… తాము నష్ట పోతున్నామని…. గుడ్డు సరఫరా చేయడం మానేశారు. దీంతో…ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు కోడిగుడ్డుకు దూరమవుతున్నారు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో…. ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు సరఫరా ఆగిపోయింది.. విద్యార్థులకు ఫౌష్టికాహారం అందించేందుకు… వారంలో మూడు రోజులు గుడ్డు అందించాలని… ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ పథకంలో భాగస్వామ్యమవుతున్నాయి.. అయితే.. మధ్యాహ్నా భోజన కార్మికులకు.. ఆరు నెలల నుంచీ వేతనాలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా.. ఇటీవల.. కోడి గుడ్డు ధరలు కూడా పెరిగిపోయాయి.. ప్రస్తుతం.. గుడ్డు ధర.. 7 రూపాయాలు ఉంది.. అయితే.. ప్రభుత్వం మాత్రం.. 5 రూపాయాలు మాత్రమే చెల్లిస్తుంది. తాము అదనంగా రెండు రూపాయాలు చెల్లించలేమని.. కార్మికులు చెబుతున్నారు. దీంతో.. గత 20 రోజులుగా.. గుడ్డును ఇవ్వడం బంద్ చేశారు. అయితే.. ప్రధానోపాధ్యాయులు.. గుడ్డును సరఫరా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ… తాము నష్టాన్ని భరించలేమని… చెబుతున్నారు. అంతేకాకుండా… అధికారులను కలిసి.. కార్మికులు నతి పత్రాన్ని సమర్పించారు.. గుడ్డు ధరలు పెరిగిన కారణంగా- తామకు అదనంగా రెండు రూపాయాలు ఇవ్వాలని కోరారు . అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని అధికారులు చెప్పారు… దీంతో గుడ్డు ఇవ్వాలేమని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా… 20 రోజుల నుంచి… గుడ్డు ఇవ్వడం లేదు… వి ద్యార్థులకు భోజనంలో గుడ్డు తినడం అలవాటుగా మారింది.. ఇప్పుడు గుడ్డు పెట్టకపోవడంతో.. సరిగా భోజనం చేయలేకపోతున్నారు…

ప్రభుత్వ పాఠశాలలో మెజారిటీ వి ద్యార్థులు.. మధ్యాహ్నా భోజనం తింటున్నారు…. ఫౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెనూ ను రూపొందించారు.. దీంతో.. పేద, మధ్య తరగతి పిల్లలకు.. ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది… మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు పెండింగ్ బిల్లులు కారణంగా.. ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో.. మెనూను సరిగా పాటించలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు. తమకు పెండింగ్ బిల్లులతో పాటు.. గుడ్డు ధరను పెంచాలని కోరుతున్నారు…

ఇవి కూడా చదవండి

ఆరు నెలల నుంచీ వేతనాలు ఇవ్వడం లేదని… కార్మికులు చెబుతున్నారు. గుడ్ల ధరలు పెరిగాయని చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. 20 రోజుల నుంచీ గుడ్డు ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. తమకు అన్నం తినలేకపోతున్నామని అంటున్నారు. గుడ్డును ఇవ్వాలని కోరుతున్నారు. 20 రోజులు పైగా… గుడ్డు.. వి ద్యార్థులకు ఇవ్వడం లేదని ఉపాధ్యాయురాలి అంటున్నారు.. తమను ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. గుడ్డి అందించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..