Viral News: డేటింగ్ యాప్‌లో పరిచయం.. తాత వయసులో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి..

ఈ జంట తమ జీవితానికి సంబంధించిన చిన్న విషయాలను టిక్‌టాక్‌లో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ ఈ జంట 50 వేల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అయితే ఏజ్ గ్యాప్ కారణంగా ఈ జంట ఆన్‌లైన్‌లో తరచూ రకరకాల కామెంట్స్ ను ఎదుర్కోవలసి వస్తుంది. కొందరు జాకీని డేవిడ్ 'దత్తపుత్రిక' అని కూడా కామెంట్ చేస్తారు. మరికొందరు జాకీని బంగారు పిచ్చుకని పట్టిందని కామెంట్ చేస్తారు. అంతేకాదు భర్తకు వచ్చే పింఛన్‌ను అనుభవిస్తోందని కూడా వ్యాఖ్యానిస్తారు.

Viral News: డేటింగ్ యాప్‌లో పరిచయం.. తాత వయసులో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి..
MisisepsteinImage Credit source: Instagram/@misisepstein
Follow us

|

Updated on: Jan 05, 2024 | 1:31 PM

ప్రేమకు ఆస్థి అంతస్తులు, కులం, మతం తో పని లేదని అనేక సినిమాల్లో, కథల్లో చూపించేవారు ఇపుడు నిజ జీవితంలో సజీవంగా దర్శనమిస్తున్నాయి. ఎల్లలుదాటిన ప్రేమ కథలతో పాటు వయసుతో సంబంధం లేకుండా ప్రేమలు పెళ్లిళ్లు గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా తన తాత వయసున్న వ్యక్తితో ఓ యువతి ప్రేమలో పడింది. అంతేకాదు నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 21 ఏళ్ల యువతి తనకంటే 42 ఏళ్లు పెద్ద వ్యక్తితో గాఢంగా ప్రేమలో పడింది. ఆపై తన ప్రేమకి న్యాయం చేస్తూ ఆమ్మాయి ఇప్పుడు ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరూ తమ పెళ్లిని పదిమందికి తెలియజేశారు. దీంతో సోషల్ మీడియాలో అమ్మాయిని ట్రోలు చేస్తున్నారు. అమ్మాయిని వృద్దుడి దత్తపుత్రిక అని కామెంట్ చేస్తూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. అయితే ఈ యువతి కూడా ఎక్కడా తగ్గేదే లే అంటూ ట్రోలర్లకు సమాధానమిస్తూ.. ‘అతను నా ప్రేమ.. నిజమైన ప్రేమకు వయస్సుతో పని లేదు’ అని చెప్పింది.

ఫిలిప్పీన్స్‌కు చెందిన జాకీ .. అమెరికాకు చెందిన డేవిడ్ లకు డేటింగ్ యాప్ లో పరిచయం అయింది. ఇద్దరూ తరచుగా చాట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా మొదలైన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో తమకే తెలియదని ఈ జంట చెబుతోంది. జాకీని కలవాలనే కోరికతో డేవిడ్ అమెరికా నుండి ఫిలిప్పీన్స్ చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు 2018లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి జాకీ , డేవిడ్ దంపతులు కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో నివసిస్తున్నారు. జాకీ వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు. అయితే ట్రోలర్లు ఇప్పటికీ జాకీ జంటను ఎగతాళి చేయడం మానలేదు.

ఇవి కూడా చదవండి

ఈ జంట తమ జీవితానికి సంబంధించిన చిన్న విషయాలను టిక్‌టాక్‌లో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ ఈ జంట 50 వేల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అయితే ఏజ్ గ్యాప్ కారణంగా ఈ జంట ఆన్‌లైన్‌లో తరచూ రకరకాల కామెంట్స్ ను ఎదుర్కోవలసి వస్తుంది. కొందరు జాకీని డేవిడ్ ‘దత్తపుత్రిక’ అని కూడా కామెంట్ చేస్తారు. మరికొందరు జాకీని బంగారు పిచ్చుకని పట్టిందని కామెంట్ చేస్తారు. అంతేకాదు భర్తకు వచ్చే పింఛన్‌ను అనుభవిస్తోందని కూడా వ్యాఖ్యానిస్తారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఇటీవల జాకీ ఒక వీడియోను షేర్ చేసింది.. అందులో డేవిడ్ తనను.. ఫిలిప్పీన్స్‌లో నివసిస్తున్న తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడో చెప్పింది. తన భర్త డేవిడ్ తన కుటుంబానికి 25 వేల డాలర్లు పంపాలని ఆలోచిస్తున్నట్లు జాకీ వీడియోలో తెలిపారు. ఈ విషయంపైనే ట్రోలర్లు జాకీని పట్టుకుని బంగారు బాతుని పట్టుకున్నావు అని అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనిపై, జాకీ ట్రోలర్లకు ఫన్నీ గా రిప్లై ఇస్తూ.. అవును డేవిడ్ నే కాదు మిమ్మల్ని చాలా ఘాడంగా ప్రేమిస్తున్నాను.. కనుక మీరు కూడా నాకు డబ్బు ఇవ్వండి అని కామెంట్ చేసింది.

తమ పెళ్లయి దాదాపు 6 ఏళ్లు అయిందని.. ఈ ఏడాది ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నామని జాకీ చెప్పింది. ఇదే విషయంపై డేవిడ్ మాట్లాడుతూ తనకు ప్రజలు చేసే కామెంట్స్ పై పట్టింపు లేదు. ఎందుకంటే మా ప్రేమ నిజం.. ఒకరిపై ఒకరికి శ్రద్ధగల భాగస్వామి దొరికినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు ఈ జంట.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ