Water Supply: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎప్పుడంటే..

Water Supply: హైదరాబాద్‌ నగరంలో అప్పుడప్పుడు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంటుంది. నగరంలోని లింగంపల్లి నుంచి బోరబండ..

Water Supply: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎప్పుడంటే..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 25, 2022 | 7:59 AM

Water Supply: హైదరాబాద్‌ నగరంలో అప్పుడప్పుడు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంటుంది. నగరంలోని లింగంపల్లి నుంచి బోరబండ వరకు ఉన్న 800 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ స్థానంలో కొత్తగా 800 ఎంఎం డయా ఎంఎస్ పైప్‌లైన్‌ వేయాలని జలమండలి నిర్ణయించింది. జనవరి 27 గురువారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అంటే జనవరి 28 శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. అందకే ఈ 24 గంటలు బోరబండ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. జనవరి 28న నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నీటి సరఫరా జరుగుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6, 9, బోరబండ, అల్లాపూర్, గాయత్రినగర్, పర్వత్నగర్, వివేకానందనగర్, ఎస్పీఆర్ హిల్స్, శ్రీరామ్నగర్, కార్మిక నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరారు.

ఇవి కూడా చదవండి:

Hyderabad: బాలికల దినోత్సవం రోజే దారుణం.. బాలాపూర్ బాలిక అమ్మకం..

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు..