Minister KTR: హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది.. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలిః కేటీఆర్

హైదరాబాద్ మహానగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

Minister KTR: హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది.. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలిః కేటీఆర్
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 25, 2022 | 12:09 PM

KTR in Hyderabad: విశ్వనగరంగా తీర్చుకుంటున్న హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కార్ తీర్చిదిద్దుతుందని మంత్రి కేటీ రామారావు(KTR) తెలిపారు. ఇందులో భాగంగానే మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నామన్నారు. రోజు రోజుకీ హైదరాబాద్(Hyderabad) విస్తరణ పెరుగుతుందన్న మంత్రి.. మరో 30 ఏళ్లల్లో ఎన్నో కిలోమీటర్ల మేరకు పెరుగుతుందన్నారు. ఇందుకు తగ్గట్టు రోడ్లు, భవనాల విస్తరణ జరగాల్సి ఉందన్నారు మంత్రి కేటీఆర్. శివారు గ్రామాలన్నీ మున్సిపాలిటీగా మారాయని, ఇందుకు తగ్గట్టుగా పట్టణ ప్రణాళిక అవసరమన్నారు. ఒకప్పుడు తాగేందుకు నీరు దొరక్క ఇబ్బందిపడ్డ నగరవాసుల కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు ఇంటికి మంచినీటిని అందిస్తున్నామన్నారు.

హైదరాబాద్ మహానగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ. 138 కోట్ల వ్యయంతో చేపట్టిన బాచూపల్లి రోడ్డు విస్తరణ పనులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగా బాచూపల్లి నుంచి ఓఆర్ఆర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నిజాంపేట మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు శంభి పూర్ రాజు, సురభి వాణి దేవి తదితరులు పాల్గొన్నారు.

Read Also… Jagapathi Babu: ఇండస్ట్రీలో నాకున్న జన్యున్ ఫ్రెండ్ అతనఒక్కడే.. ఆసక్తికర విషయం చెప్పిన జగపతి బాబు